Begin typing your search above and press return to search.

ఇలియానా బిడ్డకి తండ్రి ఇతనే

By:  Tupaki Desk   |   2 Jun 2023 10:01 PM GMT
ఇలియానా బిడ్డకి తండ్రి ఇతనే
X
ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఇలియానాని ఎవరూ అంత వేగంగా మరిచిపోరు. దేవదాసు సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ పోకిరి సినిమాతో స్టార్ హీరోయిన్ అయిపొయింది. తరువాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుస సినిమాలు చేస్తూ అగ్ర కథానాయికగా మారింది. అయితే టాలీవుడ్ లో స్టార్ చైర్ లో ఉండగానే బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఈ అమ్మడు అడుగుపెట్టింది.

అక్కడ బర్ఫీ అనే మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఇలియానా అడపాదడపా అవకాశాలు తెచ్చుకుంటూ ఒక స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. స్టార్ హీరోయిన్ మాత్రం కాలేకపోయింది. ఆమె అందాలని బాలీవుడ్ ఎవరూ పెద్దగా గుర్తించలేదు. ఎక్కువగా రొటీన్ క్యారెక్టర్స్ ని చేసింది. సీనియర్ హీరోల పక్కన నటించింది. తరువాత ఆ ఉన్న అవకాశాలు కూడా తగ్గిపోయాయి.

ఇక బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కొన్నేళ్ళకి ఒక విదేశీ బాయ్ ఫ్రెండ్ తో అమ్మడు చెట్టాపట్టాల్ వేసుకొని తిరిగేది. తరువాత ఏమైందో అతనితో బ్రేక్ అప్ అయ్యింది. కొంతకాలం ఆ డిప్రెషన్ లో ఉన్న ఇలియానా మళ్ళీ ఒకటి రెండు సినిమాలు చేసింది. రెండేళ్ళ క్రితం ఈ బ్యూటీ బిగ్ బుల్ మూవీలో నటించింది. తరువాత మరల ఒక మూవీ చేసింది. ఆ సినిమా ఈ ఏడాదిలో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం ఇలియానా గర్భవతిగా ఉన్న సంగతి తెలిసిందే. కొన్ని నెలల క్రితం తాను ప్రెగ్నెంట్ అని ఇలియానా అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసింది. తరువాత ఆమె బేబీ బాంబ్ తో ఫోటోలని షేర్ చేసింది. అయితే ఇలియాలా పుట్టబోయే బిడ్డకి తండ్రి ఎవరనే ప్రశ్న సోషల్ మీడియాలో అప్పటి నుంచి వినిపిస్తోంది. అయితే దానిపై ఆమె సమాధానం చెప్పలేదు.

తాజాగా తనకి పుట్టబోయే బిడ్డ ఎవరనేది పేస్ రివీల్ చేయకుండా హ్యాండ్స్ ఫోటోలతో క్లారిటీ ఇచ్చింది. వేరొక వ్యక్తితో ఇప్పటికే తనకి ఎంగేజ్మెంట్ కూడా అయినట్లుగా డైమండ్ రింగ్స్ పెట్టుకొని ఉన్న ఫోటోని షేర్ చేసింది. ఆ ఫోటోకి ఒక కామెంట్ కూడా పెట్టింది.

నా రొమాంటిక్ ఐడియాతో ప్రశాంతంగా అతనిని తిననివ్వలేదు అంటూ అర్ధం కాని విధంగా పోస్ట్ పెట్టింది. ఇప్పుడు ఇది వైరల్ అవుతోంది. గత కొంతకాలంలో ఇలియా కత్రినా కైఫ్ బ్రదర్ తో లవ్ లో ఉందనే ప్రచారం ఉంది. అతనే ఆమె బిడ్డకి తండ్రి అయ్యుండొచ్చు అనే టాక్ వినిపిస్తోంది.