వీడియో: కుక్కపిల్లకు జ్వరం వచ్చిందని క్లినిక్ కి వెళితే!

Fri Jul 01 2022 10:05:05 GMT+0530 (India Standard Time)

Ileana at Crown Pet Clinic

ముంబైలో సెలబ్రిటీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు. మలైకా అరోరాఖాన్.. ఇలియానా .. కియరా అద్వాణీ .. జాన్వీ కపూర్.. సారా అలీఖాన్.. ఇలా భామలంతా పబ్లిక్ లో పోష్ కల్చర్ ని ఎలివేట్ చేస్తూ నిరంతరం హెడ్ లైన్స్ లో నిలుస్తున్నారు.తాజాగా ఇలియానా ముంబై బాంద్రాలోని ఓ క్లినిక్ కి వెళ్లి తిరిగి వస్తుండగా తనని మీడియా వెంబడించింది. అది క్లినిక్ అయినా కానీ ఇల్లీని మీడియా అస్సలు విడిచిపెట్టలేదు. ఇలియానా పెట్ క్లినిక్ లో ఎంతో క్యాజువల్ లుక్ తో కనిపించింది.

ట్రాక్  ఫ్యాంట్.. సింపుల్ టీషర్ట్ తో నేచురల్ లుక్ లో బయటకు వచ్చింది. ఇక కార్ లో వెళుతున్న ఇలియానా ఒంపుసొంపుల్ని క్యాప్చుర్ చేసేందుకు సదరు మీడియా పాకులాడింది. ఇల్లీ అందచందాలు ఈ వీడియోలో హీట్ పుట్టిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో అంతర్జాలంలో వైరల్ గా మారింది.

ఇలియానా మార్నింగ్ వాక్ .. జిమ్ యోగా సెషన్లకు సంబంధించిన వీడియోలు ఇటీవల వైరల్ అయ్యాయి. అయితే గత కొంతకాలంగా ఇలియానా తిరిగి ఫ్యాట్ గా మారుతోందని తాజా వీడియో చెబుతోంది.

స్లిమ్ లుక్ స్థానంలో బొద్దుతనం కనిపిస్తోంది. సినిమాల్లేక కసరత్తులు చేయడం లేదో ఏమిటో కానీ ఇల్లీ ఇలా మారిపోవడం అభిమానులకు అస్సలు నచ్చడం లేదు. బాలీవుడ్ లో ది బిగ్ బుల్ తర్వాత మరో సినిమా చేస్తున్నట్టు కనిపించలేదు.

కొంతకాలంగా పూర్తిగా రెస్ట్ లోనే ఉంది ఈ బ్యూటీ. ఇక తెలుగులోనూ ఈ భామకు అమర్ అక్బర్ ఆంటోని తర్వాత అవకాశాల్లేవ్.