ఫోటో స్టోరీ: వాటీజ్ దిస్ ఇలియానా? ఓవర్ డోస్ ఎక్కువైంది!

Sun Feb 05 2023 17:00:17 GMT+0530 (India Standard Time)

Ileana The Overdose Look High!

ఇటీవలే అనారోగ్యంతో ఆస్పత్రి పాలైన ఇలియానా ఇంతలోనే తాను ఆరోగ్యంగానే ఉన్నానని చెప్పి అభిమానుల్లో కంగారు తగ్గించింది. అంతా ఊపిరి పీల్చుకున్నారు అనగానే మరోసారి ఇదిగో ఇలాంటి త్రోబ్యాక్ ఫోటోలతో ఊపిరి తీసుకోనివ్వడం లేదు! ప్చ్!! ఇల్లీ బూచ్ కరిచేసిందోచ్ అంటూ అభిమానులు ఈ ఫోటోషూట్ పై వ్యాఖ్యానిస్తున్నారంటే ఇక గోవా బ్యూటీ కర్వుల ఎలివేషన్ ఏ రేంజులో ఉందో అర్థం చేసుకోవాలి.తాజాగా ఇలియానా షేర్ చేసిన ఫోటోగ్రాఫ్ లో వైట్ అండ్ వైట్ బికినీలో టూ హాట్ గా ప్రత్యక్షమైంది. తనతో పాటు ఫ్రెండు కూడా బికినీ బీచ్ సెలబ్రేషన్ లో వేడెక్కిస్తోంది. ఇది త్రోబ్యాక్ ఫోటోనే అయినా ఇలా క్లోజప్ షాట్ లో ఇలియానా ఒంపుసొంపుల రూపలావణ్యం బయటపడడంతో అభిమానులు ఈ ఫోటోని వైరల్ గా షేర్ చేస్తున్నారు.

ఇల్లీ అందాలను చూసేందుకు రెండు కళ్లు చాలవు! అంటూ ఒక సెక్షన్ అభిమానులు ఫిదా అయిపోతుంటే ఇలా ఇల్లీ వైరస్ జ్వరం పెంచేస్తోంది! అంటూ మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. వాటీజ్ దిస్ ఇలియానా! ఓవర్ డోస్ ఎక్కువైంది? అంటూ మరికొందరు అభిమానులు తనను నిలదీస్తున్నారు.

ఏది ఏమైనా ఇలియానా నెవ్వర్ బిఫోర్ హాట్ లుక్ కి మెజారిటీ అభిమానులు ఫిదా అయిపోతున్నారు. ది బిగ్ బుల్ తర్వాత మరో సినిమాలో కనిపించని ఇలియానా తదుపరి కెరీర్ పై ఏమంత శ్రద్ధ పెట్టినట్టుగా కనిపించలేదు.

ఇక ఈ గోవా బ్యూటీకి ఒక అరుదైన వ్యాధి ఉందని ఇంతకుముందు బహిరంగంగానే ప్రకటించింది. దానికి ఇప్పటికే వైద్య చికిత్స తీసుకుంటోంది. అయితే తన ఫిజిక్ మెయింటెయిన్ చేసే విషయంలోను శ్రద్ధ తగ్గిపోయిందని తాజా లుక్ చెబుతోంది.

మునుపటితో పోలిస్తే మెరుపు తీగలా కాదు బొద్దమ్మాయ్ లా కనిపిస్తోందంటూ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆ బొద్దుతనం తగ్గితే ఇంకా బెటర్ గా ముద్దుగా ఉంటుందని దర్శకనిర్మాతలు సినిమాలు ఆఫర్ చేస్తారని సజెస్ట్ చేస్తున్నారు.

మరి ఈ సలహాలను పాజిటివ్ గా తీసుకుని పాటిస్తుందా లేదా చూడాలి. ఇలియానా నటించిన ఒకే ఒక చిత్రం `అన్ ఫెయిర్ అండ్ లవ్ లీ` ఎప్పుడు విడుదలకు వస్తుందో?


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.