Begin typing your search above and press return to search.

ఇల్లీ క‌ష్టం ప‌గోడికైనా రాకూడదు సుమీ

By:  Tupaki Desk   |   22 Jan 2020 12:51 PM GMT
ఇల్లీ క‌ష్టం ప‌గోడికైనా రాకూడదు సుమీ
X
ఇల్లియానా.. చిల్లియానా.. అంటూ క‌వితలు అల్లాడో సినీక‌వి. ఇల్లీ న‌డుము వొంపు చూశాక‌ అత‌డికి అలా ప్రాస పుట్టుకొచ్చింది. శంక‌ర్ త్రీ ఇడియ‌ట్స్ రీమేక్ న‌న్బ‌న్ (స్నేహితుడు) లో ఇలియానా స్పెష‌ల్ సాంగ్ మ‌ర్చిపోలేం. ఆ పాట‌లో స‌న్న‌జాజి న‌డుమును ఊపుతూ వ‌య్యారాలు ఒల‌క‌బోసిన తీరును యూత్ అంత తేలిగ్గా మ‌ర్చిపోలేరు. ఇక టాలీవుడ్ ఆరంగేట్ర చిత్రం దేవ‌దాస్ లో ఆయిలీ టోన్డ్ లుక్ తో కనిపించి కుర్ర‌కారుకు కంటిపై కునుకు క‌రువయ్యేలా చేసిన ఇలియానాను ఎవ‌రూ అంత తేలిగ్గా మ‌ర్చిపోలేరు. ఇల్లీ బేబీ 180- 360డిగ్రీల ఒంపుసొంపులు చూసి దేవ‌దాస్ సినిమాలో అవ‌కాశం ఇచ్చారు వైవియ‌స్. తొలి సినిమాతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకుని అటుపై ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్లు ఇండ‌స్ట్రీ హిట్స్ లో న‌టించింది. స్టార్ హీరోలంద‌రి స‌ర‌స‌న జాక్ పాట్ కొట్టేసింది.

ద‌శాబ్ధం పైగానే టాలీవుడ్ ని ఏలిన ఇలియానా కాల‌క్ర‌మంలో బాలీవుడ్ వైపు అడుగులు వేసింది. అయితే అక్క‌డ కెరీర్ ఆశించినంత బెస్ట్ ఫేజ్ కి చేరుకోలేదు. ఇంత‌లోనే ప్రియుడు కం ఫోటోగ్రాఫ‌ర్ ఆండ్రూ నీబోన్ ఇచ్చిన ఝ‌ల‌క్ నుంచి అస్స‌లు కోలుకోలేక‌పోతోంది. ప్రియుడితో బ్రేకప్ చెప్పేసే క్ర‌మంలోనే తీవ్ర ఆవేద‌న‌లో ఇలియానా మాన‌సిక స‌మ‌స్య‌ల్లోకి వెళ్లిపోయింది. దాంతో పాటే బాగా బొద్దెక్కిపోయింది. ఒకానొక ద‌శ‌లో ఇలియానానా? బ్రిట్నీ స్పియ‌ర్స్ నా? అన్నంత‌గా రూపం మారిపోయింది. మ‌రీ అంత‌గా బొద్దెక్కిపోవ‌డం చూశాక అస‌లేం జ‌రుగుతోంది? అన్న సందేహం క‌లిగింది. ఆ క్ర‌మంలోనే త‌న రూప‌లావ‌ణ్యం ఏమాత్రం చెక్కు చెద‌ర‌లేద‌ని ప్రూవ్ చేసేందుకు వ‌రుస‌గా ఫోటో లీకులు ఇస్తూ నానా తంటాలు ప‌డింది.

అయితే దాచితే దాగేదా అధిక‌ బ‌రువు స‌మ‌స్య‌. తాను ఎలాంటి డ్రెస్ తొడిగినా బొద్దెక్కిన అందాలు బ‌య‌ట‌పడుతూనే ఉన్నాయి. ఎంత‌గా క‌వ‌రింగ్ చేయాల‌నుకున్నా ఇట్టే తెలిసిపోతోంది. చిరుత చ‌ర్మం ఫార్మ‌ల్ డ్రెస్ లో అలా ఆరుబ‌య‌ట న‌డిచి వెళుతూ కెమెరా కంటికి చిక్కింది. ఇలా ఎంతో క్యాజువ‌ల్ గా క‌నిపిస్తున్నా.. త‌న బొద్దందం క్లియ‌ర్ క‌ట్ గా బ‌య‌ట‌ప‌డింది. ఇక ఆ న‌డుము చుట్టూ కొవ్వును క‌రిగించి తిరిగి పాత రూపానికి రావాలంటే ఇలియానా చాలానే శ్ర‌మించాల్సి ఉంటుందేమో! అయితే వ‌య‌సుతో పాటే పెరిగే బ‌రువును త‌గ్గించాలంటే ఆరోగ్య నిపుణుల స‌ల‌హాలు తీసుకుని ఆ ప‌ని చేయాల్సి ఉంటుంది. న‌వంబ‌ర్ లో రిలీజైన `పాగ‌ల్ పంతి` సినిమాలో ఈ భామ‌ ఓ క‌థానాయిక‌గా న‌టించింది. బాక్సాఫీస్ వ‌ద్ద ఆ చిత్రం ఫ‌ర్వాలేద‌నిపించింది. ప్ర‌స్తుతం అభిషేక్ బ‌చ్చ‌న్ `ది బిగ్ బుల్` చిత్రంలోనూ ఇలియానా న‌టిస్తోంది. ఇల్లీ క్లోజ్ బ‌డ్డీ.. బాలీవుడ్ మెంటార్ అజ‌య్ దేవ‌గ‌న్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.