ఇలియానా తెలుగులో మొదటిసారి..!

Thu Nov 08 2018 14:30:42 GMT+0530 (IST)

Ileana Dubbing Own Voice For Amar Akbar Antony Movie

గోవా బ్యూటీ ఇలియానా తెలుగులో టాప్ హీరోయిన్ గా స్టార్ డం దక్కించుకుని తెలుగులో మంచి ఫాంలో ఉన్న సమయంలోనే బాలీవుడ్ కు వెళ్లింది. అక్కడ రెండు మూడు సంవత్సరాలు పెద్ద సినిమాల్లో నటించిన ఇల్లీబేబీ అక్కడ ఆఫర్లు లేకపోవడంతో పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత ఇలియానా సినిమాలకు గుడ్ బై చెబుతుందేమో అనుకుంటున్న సమయంలో తెలుగులో ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రవితేజ శ్రీనువైట్లల కాంబినేషన్ లో రూపొందిన ఈ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది.తెలుగులో గతంలో ఎన్నో చిత్రాల్లో నటించిన ఇలియానా ఏ ఒక్క సినిమాలో కూడా సొంతంగా డబ్బింగ్ చెప్పుకోలేదు. కాని మొదటి సారి తెలుగులో ఇలియానా రీ ఎంట్రీ చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటోనీ’కి డబ్బింగ్ చెప్పింది. కథానుసారంగా ఆమెకు సొంత వాయిస్ అయితేనే బాగుంటుందని దర్శకుడు శ్రీనువైట్ల భావించాడట. అందుకే ఇలియానాతో డబ్బింగ్ చెప్పించినట్లుగా సమాచారం అందుతుంది. ఇలియానా డబ్బింగ్ తో పాత్ర వెయిట్ పెరుగుతుంది. దాంతో సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది.

ఇలియానా గురించి శ్రీనువైట్ల మాట్లాడుతూ.. నేను ఈ చిత్రం కథ రాసుకున్నప్పుడు ఇలియానా నా మైండ్ లోకి వచ్చింది. ఎంతో మంది హీరోయిన్స్ ను పరిశీలించినా కూడా వర్కౌట్ కాదని నిర్ణయానికి వచ్చి చివరకు ఆమెను నటింపజేయాలని నిర్ణయించుకున్నాం. ఇలియానా తెలుగు బాగా మాట్లాడుతుంది. అందుకే ఆమెతో డబ్బింగ్ చెప్పించాలని భావించాను. డబ్బింగ్ చెప్పే సమయంలో ఇలియానా సింగిల్ టేక్ లోనే ఓకే చేసేయడం నాకు ఆశ్చర్యంను కలిగించింది అన్నాడు.