వీడియో: దేవదాసు పోకిరి వెంటాపడతారేమో

Tue Jul 14 2020 20:30:07 GMT+0530 (IST)

Video: Going back to Devadasu Pokiri days

సన్నజాజి సోయగం ఇలియానా లైఫ్ జర్నీ గురించి చెప్పాల్సిన పనే లేదు. రామ్ సరసన `దేవదాసు` చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే యూత్ గుండెల్లో చెరగని స్థానం సంపాదించింది. ఆయిలీ టోన్డ్ బాడీతో సన్నజాజి నడుముతో హీటెక్కించింది. `పోకిరి` సంచలన విజయం సాధించాక.. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. ఆ తర్వాత టాలీవుడ్ అగ్ర హీరోలందరి సరసన నటించేసింది.కాలక్రమంలో హిందీ పరిశ్రమపై మోజుతో అటువైపు వెళ్లిపోయింది. తెలుగులో ఆఫర్లు తగ్గడంతో కొత్త దారులు వెతుక్కుంది. అదే క్రమంలో ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్ తో పరిచయం ప్రేమ వ్యవహారం అటుపై బ్రేకప్ గురించి తెలిసిందే. లవ్ బ్రేకప్ తో ఇల్లీ బేబీ పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. కొన్నేళ్లుగా కోలుకోలేకపోతోంది.

జీవితంలో ఇలాంటి ఒకరోజు ఉంటుందని తాను ఊహించినట్టు లేదు. అందుకే ఇటీవల దాని నుంచి బయటపడేందుకు కఠోరంగానే శ్రమిస్తోంది. ప్రస్తుతం జిమ్ములో వ్యాయామం చేస్తూ రూపురేఖల్ని మార్చుకుంటోంది. ఇంతకుముందు డిప్రెషన్ వల్ల బాగా బొద్దెక్కింది. ప్రస్తుతం ఫ్యాట్ మొత్తం తొలగిపోయింది. పూర్తిగా మునుపటి రూపానికి మారిపోతోంది నెమ్మదిగా. ఇప్పటికిప్పుడు ఇలియానాను దగ్గరగా చూస్తే నమ్మడం కష్టమే అన్నంతగా మారిపోయింది. తిరిగి దేవదాసు.. పోకిరి రోజుల్ని తెచ్చేసినట్టే కనిపిస్తోంది. ఒకవేళ మళ్లీ దేవదాసు.. పోకిరీనే వెంటాడినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అలా చెమటలతో తడిసిపోతూ.. సన్నజాజి నడుముతో బెల్లీ డ్యాన్స్ ఆడేస్తుంటే.. ఎవరైనా దరికి చేరనివ్వమని అంటారా ఏమిటీ?!!

TAGS: Ileana