Begin typing your search above and press return to search.

అమిగోస్ దర్శకుడి కమిట్ మెంట్ గురించి తెలిస్తే కంటతడి ఖాయం

By:  Tupaki Desk   |   6 Feb 2023 3:03 PM GMT
అమిగోస్ దర్శకుడి కమిట్ మెంట్ గురించి తెలిస్తే కంటతడి ఖాయం
X
సినిమాను వినోదంగా చూసేవాళ్లు బోలెడంతమంది. కానీ.. దాన్ని పరమ పవిత్రంగా చూసుకునే వారు కొందరుంటారు. సినిమా పట్ల వారికుండే ఫ్యాషన్ గురించి చూస్తే.. షాక్ తినాల్సిందే. సినిమా కోసం నిద్రాహారాలు మానేసి.. ఇరవైనాలుగు గంటలు ఆ లోకంలోనే ఉండే కొందరుంటారు.మరికొందరు చిత్ర పరిశ్రమకు వచ్చి.. ఏదో ఒకటి సాధించేవరకు ఎన్ని కష్టాలకైనా సిద్ధమన్నట్లుగా ఉంటారు. ఈ వారం విడుదలయ్యే కల్యాణ్ రామ్ మూవీ 'అమిగోస్'. ఈ చిత్రం మీద ఉన్న బజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

నిర్మాణంలో ఉన్నప్పుడు కంటే నిర్మాణాంతరం ఈ సినిమాకు వచ్చిన బజ్.. ఈ సినిమా మీద అంచనాల్ని పెంచేసింది. ఇప్పుడు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న వారు ఉన్నారు. తాజాగా ఈ మూవీ ప్రిరిలీజ్ ఫంక్షన్ జరిగింది.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రాజేంద్ర గురించి షాకింగ్ విషయాల్ని వెల్లడించారు. ఇంజనీరింగ్ చదివిన దర్శకుడు రాజేందర్.. సినిమా మీద ఉన్న ఆరాధనతో.. తాను ఒక సినిమాకు దర్శకత్వం వహించే వరకు ఇంటికి రానని ఇంట్లో చెప్పి మరీ బయటకు వచ్చాడని చెప్పారు.

అతని ప్రయాణంలో అమిగోస్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారని.. అయితే.. కొద్ది కాలం క్రితం ఆయన తన తండ్రిని కోల్పోయారని.. ఇటీవల తన తల్లిని కోల్పోయారని చెప్పారు. సినిమా మీద అతడికున్న కమిట్ మెంట్ కోసమైనా.. అతని ఒక్కడి కోసమైనా ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. తారక్ నోటి నుంచి తన గురించి, సినిమా మీద తనకున్న కమిట్ మెంట్ గురించి విన్న రాజేందర్ భావోద్వేగానికి గురయ్యారు.

సినిమాల మీద మమకారం.. ప్రేమ లాంటి మాటల్ని వింటాం కానీ.. మరీ ఈ స్థాయిలో ఉన్న వ్యక్తుల గురించి మాత్రం చాలా అరుదుగా వింటుంటాం. రాజేంద్ర గురించి విన్న తర్వాత.. అతడి మీద ప్రేమాభిమానాలు పెరిగిపోవటమే కాదు.. నిజంగానే అమిగోస్ కచ్ఛితంగా విజయం సాధించాలన్న మాట రావటం ఖాయం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.