Begin typing your search above and press return to search.
దీపికా బికినీ వివాదం లేకుంటే 'పఠాన్' పరిస్థితి ఏంటీ?
By: Tupaki Desk | 31 Jan 2023 2:30 PM ISTబాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నాలుగు ఏళ్ల గ్యాప్ తర్వాత పఠాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దాదాపు పదేళ్లుగా ఆయన నటించిన సినిమా కమర్షియల్ గా భారీ విజయాలను సొంతం చేసుకోలేక పోయాయి. దాంతో షారుఖ్ ఖాన్ పనైపోయింది అంటూ ఆయన ప్రత్యర్థి వర్గం ప్రచారం చేశారు. పఠాన్ కూడా ఆడకపోవచ్చు అన్నారు.
పఠాన్ ఏకంగా రూ.500 కోట్ల వసూళ్లకు మించి రాబట్టడంతో ఇప్పుడు అంతా కూడా నోరు వెళ్లబెడుతున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీ గత నాలుగు ఏళ్లుగా కలెక్షన్స్ కరువులో ఉంది. ఇలాంటి సమయంలో ఒక తుఫాన్ మాదిరిగా పఠాన్ సినిమా వసూళ్లను రాబడుతూ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ కి ఆశలను కలిగించింది.
ఈ సమయంలో పఠాన్ ను కొందరు విమర్శిస్తున్నారు. పఠాన్ సినిమా కేవలం దీపికా పదుకునే కాషాయం బికినీ ధరించడం వల్ల ఏర్పడిన వివాదం కారణంగా నడుస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. పఠాన్ విడుదలకు కొన్ని వారాల ముందు బేషరమ్ సాంగ్ విడుదల అయ్యి అప్పటి నుండి ప్రతి రోజు కూడా ఏదో ఒక చోట ఏదో ఒక విషయమై పఠాన్ సినిమా వార్తల్లో ఉంటూనే ఉంది.
పఠాన్ సినిమాకు బికినీ వివాదం కలిసి వచ్చిన మాట వాస్తవమే. కానీ ఆ బికినీ వల్లే ఇన్ని వందల కోట్ల వసూళ్లు నమోదు చేసింది అంటే మాత్రం కచ్చితంగా అవాస్తవం. కానీ ఓపెనింగ్స్ భారీగా రావడానికి ఆ వివాదం బాగా హెల్ప్ అయ్యింది అనడంలో సందేహం లేదు. ఆ భారీ ఓపెనింగ్స్ లేకుంటే ఇప్పుడు ఇంత భారీ సంఖ్య నమోదు అయ్యేది కాదు అనేది మరి కొందరి మాట.
మొత్తానికి పఠాన్ సినిమా సూపర్ డూపర్ హిట్ లో దీపికా పదుకునే యొక్క బికినీ వివాదం కీలకం. ఆ వివాదానికి తోడు దేశ వ్యాప్తంగా షారుఖ్ ఖాన్ కు ఉన్న స్టార్ డమ్ కూడా కలిసి వచ్చింది. షారుఖ్ ఖాన్ స్టార్ డమ్ మరియు కంటెంట్ సినిమాకు ఇంత భారీగా వసూళ్లు తీసుకు వచ్చాయా లేదంటే వివాదం ఈ భారీ వసూళ్లు తీసుకు వచ్చిందా తెలియాలంటే షారుఖ్ తాజా చిత్రం జవాన్ విడుదల అవ్వాల్సి ఉంది. జవాన్ సినిమా కూడా ఇదే స్థాయిలో ఓపెనింగ్స్ వసూళ్లు నమోదు చేస్తే అప్పుడు పఠాన్ సక్సెస్ లో బికినీ పాత్ర లేదు అని షారుఖ్ యాంటీ ఫ్యాన్స్ ఒప్పుకునే అవకాశం ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.