ఆ హిందీ సినిమా నాగార్జున చేసి ఉంటే..!

Sun Aug 01 2021 20:20:25 GMT+0530 (IST)

If that Hindi movie was made by Nagarjuna

నాగార్జున టాలీవుడ్ లో మోస్ట్ బిజీ హీరోగా ఉన్న సమయంలోనే హిందీ నుండి పలు ఆఫర్లు వచ్చాయి. నాగార్జున హిందీలో చేయాల్సిన ఒక సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి అయిన తర్వాత క్యాన్సిల్ అయ్యిందట. ఆ విషయాలను తాజాగా ఒక టాక్ షో లో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కమ్ ప్రొడ్యూసర్ అయిన ఎస్ గోపాల్ రెడ్డి తెలియజేశారు. కేఎల్ నారాయణ బాలీవుడ్ నిర్మాణ సంస్థతో కలిసి బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ అశోక్ మెహతా దర్శకత్వంలో ఒక సినిమాను చేయాల్సి ఉంది. రెండు రోజుల వ్యవధిలో సాగే కథతో ఆ సినిమా నడుస్తుంది. తనను చంపేందుకు ప్రయత్నించిన ముగ్గురు విలన్స్ పై రివేంజ్ తీర్చుకునే హీరో కథతో ఆ సినిమాను అనుకున్నాం. హిందీలో నాగార్జునకు అప్పటికే మంచి గుర్తింపు ఉన్నది కనుక ఆయన కు జోడీగా నటించేందుకు గాను డింపుల్ కపాడియా ను ఎంపిక చేయడం జరిగింది. కీలక పాత్రలో అనుపమ్ ఖేర్ ను నటింపజేసేందుకు సిద్దం అయ్యారు.ఎస్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ఆ సినిమా స్క్రిప్ట్ వర్క్ అంతా పూర్తి అయ్యి ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి అయ్యింది. వారం పది రోజుల్లో షూటింగ్ ప్రారంభోత్సవంకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ సమయంలో నేను నాగార్జున గారి అన్న వెంకట్ మరియు కేఎల్ నారాయణకు కొన్ని సన్నివేశాల విషయంలో అసంతృప్తి వ్యక్తం అయ్యింది. ఆ సన్నివేశాలను మార్చాల్సిందిగా మేము అశోక్ మెహతా వద్ద ప్రపోజల్ పెట్టాము. కాని ఆయన అందుకు ఒప్పుకోలేదు. ఆ సన్నివేశాలు ఉంటే ఖచ్చితంగా సినిమా ఫలితం తారు మారు అయ్యే అవకాశం ఉందని.. ఇక్కడ నాగార్జున ఇమేజ్ కు తగ్గట్లుగా ఆ సన్నివేశాలు లేవు అనుకున్నాం. ఆయన్ను ఒప్పించేందుకు ప్రయత్నించినా కూడా అందుకు ఒప్పుకోలేదు.

ఆ సమయంలోనే ఈ సినిమాను పాన్ ఇండియా సినిమాగా ప్లాన్ చేశాము. 1990ల్లో నాగార్జున తో ఆ సినిమా అనుకున్న సమయంలో చాలా మంది ఆ ప్రాజెక్ట్ పై ఆసక్తి చూపించారు. కాని కొన్ని కారణాల వల్ల సినిమాను క్యాన్సిల్ చేసినట్లుగా మేకర్స్ ప్రకటించారు. అప్పట్లో నాగార్జునకు బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉండేది. ఆ సినిమాను కనుక చేసి ఉంటే... అక్కడ విజయాన్ని సొంతం చేసుకుని ఉంటే నాగార్జున అప్పట్లోనే పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు దక్కించుకునేవాడు.. డైరెక్ట్ హిందీ సినిమాలు ఇంకా చాలా చేసి బాలీవుడ్ స్టార్ గా కూడా నిలిచే వాడేమో అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.