నాగ్ ద్విపాత్రాభినయం చేస్తే జోడీగా రేఖ

Mon Nov 18 2019 07:20:42 GMT+0530 (IST)

If Nag Do Triple Role Heroine Rekha Will Be Lead Role

అక్కినేని జాతీయ పురస్కారాన్ని ప్రతీ ఏట ఓ స్టార్ కి అందజేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాదికి గానూ ఈ అవార్డుని సీనియర్ నటి గ్లామర్ క్వీన్ రేఖకి అందజేశారు. ఈ కార్యక్రమంలో  హైదరాబాద్ లోని అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్ లోని ఫ్లోర్ లో జరిగింది. ఈ కార్యక్రమం ఆద్యంతం ఆసక్తికరంగా సాగడం విశేషం. దీనికి తోడు కొత్త చర్చకు దారితీసింది. ఈ సందర్భంగా నాగార్జునకు హీరోయిన్ రేఖకు మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. రేఖ తొలి చిత్రంతో పాటు ఆమె అందంపై నాగార్జున చేసిన కామెంట్‌కు రేఖ అంతే ధీటుగా సమాధానం చెప్పడం పలువురిని ఆశ్చర్యపరిచింది.రేఖని సంబోధిస్తూ మీరు ఇంత అందంగా ఎలా వున్నారని నాగార్జున అడిగితే మీరు ఎంత అందంగా వున్నారో నేనూ అంతే అందంగా వున్నానని రేఖ సమాధానం చెప్పడం పలువురిని ఆకట్టుకుంది. వరుస ప్రశ్నల వర్షాన్ని గమనించిన రేఖ ఇది అవార్డు ఫంక్షన్ లా లేదని ప్రశ్నలు సమాధానాలు లా వుందని చమత్కరించింది. ఇదే సమయంలో శ్రీదేవి నటించిన 'ఆఖరీ రాస్తా' చిత్రానికి శ్రీదేవి బిజీగా వుందని చెప్పడంతో ఆమె పాత్రకు తానే డబ్బింగ్ చెప్పానని తెలిపింది. ఈ లోగా శ్రీదేవితో కలిసి నాలుగు చిత్రాల్లో  నటించాను. మీతో కలిసి నటించాలని వుందని నాగార్జున అడగడంతో వెంటనే మైక్ అందుకున్న చిరు నాగ్ ద్విపాత్రాభినయం చేస్తే అందులోని ఓ పాత్రకు జోడీగా రేఖ నటిస్తారంటూ చెప్పడం సభా ప్రాంగణం అంతా చప్పట్లతో మారుమ్రోగింది.