Begin typing your search above and press return to search.

మరోసారి సూపర్ స్టార్ తో ఐకాన్ స్టార్ పోటీ

By:  Tupaki Desk   |   3 Jun 2023 11:00 AM GMT
మరోసారి సూపర్ స్టార్ తో ఐకాన్ స్టార్ పోటీ
X
సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేస్తోన్న గుంటూరు కారం మూవీ ప్రస్తుతం ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సినిమా మూడో షెడ్యూల్ షూటింగ్ కి మాటల మాంత్రికుడు సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. డేట్ కూడా ఎనౌన్స్ చేసేశారు. దానికి తగ్గట్లుగానే త్రివిక్రమ్ ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు సంక్రాంతి రేసులో సూపర్ స్టార్ కి పోటీగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాబోతున్నాడా అంటే అవుననే మాట వినిపిస్తోంది. అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప ది రూల్ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తాజాగా రంపచోడవరంలో షెడ్యూల్ కంప్లీట్ చేసుకొని హైదరాబాద్ తిరిగొచ్చారు.

ఇప్పుడు పుష్ప సినిమా సంక్రాంతి రేసులోకి వచ్చే ఛాన్స్ ఉందనే మాట ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. సంక్రాంతిగా మెగా హీరోల నుంచి పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ లేదా రామ్ చరణ్ గేమ్ చేంజర్ రిలీజ్ అవుతుందని అందరూ భావించారు. అయితే ఈ రెండు సినిమాలకి సంబందించిన రిలీజ్ పై నిర్మాతలు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.

అయితే పవన్ కళ్యాణ్ కాల్ షీట్స్, షూటింగ్ బట్టి ఆ మూవీ ఇప్పుడు రిలీజ్ అవుతుందనే విషయంపై క్లారిటీ వస్తుంది. అయితే ఈ లోపు పుష్ప షూటింగ్ కంప్లీట్ అయ్యేలా ఉండటంతో మైత్రీ నిర్మాతలు దీనిని ముందుకి తీసుకొచ్చే ప్లాన్ లో ఉన్నారంట. సుకుమార్ నుంచి కొంత క్లారిటీ రావడంతో బయ్యర్లకి కూడా పుష్ప2 సంక్రాంతి రిలీజ్ కి రెడీగా ఉండాలని చెప్పారంట.

గతంలో మహేష్ బాబు, అల్లు అర్జున్ 2020లో అల వైకుంఠపురంలో, సరిలేరు నీకెవ్వరు సినిమాలతో పోటీ పడ్డారు. రెండు సంక్రాంతికి రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. రెవెన్యూ పరంగా అల వైకుంఠపురంలో 160 కోట్లు కలెక్ట్ చేస్తే, సర్కారువారిపాట 130 కోట్లు కలెక్ట్ చేసింది. ఇద్దరి కెరియర్ లో ఇది ఆల్ టైం హైయెస్ట్ షేర్. కాని ఈ రేసులో అల్లు అర్జున్ కాస్తా ముందున్నాడు.

దీంతో మహేష్ అభిమానులు అతన్ని ఎక్కువగా ట్రోల్ చేశారు. ఇప్పుడు మరోసారి సంక్రాంతి రేసులో 2024లో వీరిద్దరూ పోటీ పడే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ పండితుల అంచనా.