ఐస్ క్రీమ్ తేజస్వి.. బెడ్ పై టవల్ తో..

Sat Dec 03 2022 12:00:01 GMT+0530 (India Standard Time)

Ice cream tejaswi.. With a towel on the bed.

తెలుగు చిత్ర పరిశ్రమలో కొంతమంది తెలుగు అమ్మాయిలు గ్లామరస్ పాత్రలు చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా వారికి సరైన అవకాశాలు దొరకడం లేదు. ఒకప్పుడు తెలుగు అమ్మాయిలు గ్లామర్ పాత్రలు చేయడానికి అంతగా ఆసక్తిని చూపరని అందుకే అవకాశాలు ఇవ్వడం లేదు అని కామెంట్స్ ఎక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు నార్త్ బ్యూటీలకు ఏమాత్రం తక్కువ కాకుండా తెలుగు నటిమణులు కూడా గ్లామరస్ పాత్రలో నటించడానికి ఒప్పుకుంటున్నారు.ఇక అలాంటి వారిలో తేజస్వి మదివాడ కూడా ఉంటుంది. అయితే ఈ బ్యూటీ దురదృష్టం ఏమిటో గాని మొదట్లో వచ్చిన క్రేజ్ ఆ తర్వాత ఎక్కువ కాలం కొనసాగలేదు. మొదట ఒక డాన్స్ ట్యూటర్ గా కొనసాగిన ఏజస్వి ఆ తర్వాత హీరోయిన్ గా తన ప్రయాణాన్ని కొనసాగించాలని అనుకుంది. కానీ ఆమె అవకాశాల కోసం ఎదురుచూస్తున్న ప్రయత్నంలోనే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో అవకాశంలో ఇచ్చింది.

పాత్ర చిన్నదే అయినా మహేష్ బాబుతో నటించే అవకాశం కాబట్టి అందరూ గుర్తుపట్టే ఛాన్స్ ఉంటుంది అని ఆ సినిమా చేసేందుకు ఒప్పుకుంది. అయితే ఆ సినిమా వలన కేవలం క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనే ముద్ర కూడా పడింది. ఇక తర్వాత ఐస్ క్రీమ్ అనే సినిమాతో గ్లామరస్ బ్యూటీగా తనను తాను సరికొత్తగా ప్రెసెంట్ చేసుకుంది. కానీ ఆ సినిమా పెద్దగా క్లిక్ అవ్వలేదు.

ఇక ఆ తరువాత అడపడపా సినిమాలు చేసుకుంటూ వెళుతున్న తేజస్వి సోషల్ మీడియాలో కూడా తన గ్లామర్ తో సరికొత్తగా ఆకట్టుకుంటుంది. రీసెంట్ గా ఆమె పోస్ట్ చేసిన ఒక ఫోటో చూస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే. అందులో బెడ్ పై తేజస్వి ఒక టవల్ తో మాత్రమే కనిపిస్తుంది.

అందమైన స్మైల్ కూడా సరికొత్తగా ఉందని సడన్ గా చూస్తే నువ్వు కాదేమో అని అనుకున్నాము అని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా కూడా గ్లామర్ తో మాత్రం సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోవర్స్ పెంచుకుంటుంది. మరి రాబోయే రోజుల్లో ఆమెకు మంచి అవకాశాలు ఏమైనా వస్తాయో లేదో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.