Begin typing your search above and press return to search.

'కార్తికేయ‌-2' ని మెచ్చిన ఇస్కాన్

By:  Tupaki Desk   |   17 Aug 2022 9:08 AM GMT
కార్తికేయ‌-2 ని మెచ్చిన ఇస్కాన్
X
యంగ్ హీరో నిఖిల్ సిద్దార్ద్ నటించిన 'కార్తికేయ 2' బాక్సాఫీస్ ని షేక్ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈనెల 13 న రిలీజ్ అయిన సినిమా పాన్ ఇండియా వైడ్ రికార్డు వ‌సూళ్ల దిశ‌గా ప‌య‌నిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లతో పాటు హిందీ బెల్ట్ లోనూ హౌస్ పుల్ క‌లెక్ష‌న్ల‌తో దూసుకుపోతుంది. 'కార్తికేయ' హిట్ నేప‌థ్యంలో ఏర్ప‌డిన బ‌జ్ ని నూరుశాతం సుసాధ్యం చేయ‌డంలో సీక్వెల్ స‌క్సెస్ అయింది.

తెలుగు మార్కెట్ ని మించి హిందీ మార్కెట్ లో సినిమా ప‌రుగులు పెట్టిస్తుంది. ప్ర‌స్తుతం టీమ్ ఆ స‌క్సెస్ ని ఎంజాయ్ చేస్తుంది. 'కార్తికేయ‌-3' ని అంత‌ర్జాతీయ స్థాయిలో నిర్మించ‌డానికి బ‌డా నిర్మాణ సంస్థ‌లు మ‌ధ్య గ‌ట్టి పోటీ ఏర్ప‌డినా ఆశ్చ‌ర్య‌న‌పోన‌వ‌సరం లేదు. తాజాగా ఈ చిత్రానికి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ సినిమాకు ద‌క్క‌ని అరుదైన గౌరవం దక్కింది.

ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్ (ఇస్కాన్) కేట‌గిరీ 'కార్తికేయ 2' బృందానికి ప్రశంసాపత్రం మరియు కృతజ్ఞతా పత్రాన్ని జారీ చేసింది. ఇది నిజ‌యంగా అరుదైన గౌర‌వ‌మే. అంత‌ర్జాతీయ స్థాయిలో ఫేమ‌స్ అయిన ఇస్కాన్ ఓ చిత్రాన్ని మెచ్చ‌డం అంటే చిన్న విష‌యం కాదు. త‌మ సిద్దాంతాలు..భావ‌జాలంపైనా సినిమా అనేది ఎంతో ప్ర‌భావం చూపితే త‌ప్ప ఇలాంటి అర‌దైన ఘ‌ట్టాలు చోటు చేసుకోవు.

ఇస్కాన్ ఇంత వ‌ర‌కూ ఏ సినిమాకి ప్ర‌శంస ప‌త్రాన్ని జారీ చేసింది లేదు. ఆ ర‌కంగా ఇస్కాన్ నుంచి 'కార్తికేయ‌-2' కి అరుదైన గౌర‌వం ద‌క్కింద‌ని చెప్పొచ్చు. ఇంతకుముందు ఇస్కాన్ బృందావన్ 'కార్తికేయ 2' టీమ్ మొత్తాన్ని ఆహ్వానించింది. శ్రీకృష్ణుడి ఆశీస్సులతో టీజర్‌ను లాంచ్ చేసింది. 'కార్తికేయ 2' శ్రీ కృష్ణ భగవానుడి భావజాలం మరియు ఆధ్యాత్మికత‌ని ఆధారంగా చేసుకుని తెర‌కెక్కించారు.

ఈ నేప‌థ్యంలోనే ఇస్కాన్ బృందం మన చరిత్రను చూపించడానికి కార్తికేయ టీమ్ ప‌డిన కృష‌ని గుర్తించి ఇలాంటి అరుదైన గౌర‌వం క‌ల్పించిన‌ట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వ‌హించారు. బాలీవుడ్ న‌టుడు అనుపమ్ ఖేర్ ముఖ్య పాత్ర పోషించారు.

అనుపమ పరమేశ్వరన్.. సత్య తదితరులు కీలక పాత్రల్లో న‌టించారు. కాల భైర‌వ సంగీతం అందించారు. అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్స్ట్- పీపూల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంయుక్తంగా నిర్మించాయి.