Begin typing your search above and press return to search.

ఇంత ఆనందానికి కాస్త గ్యాప్ ఉంటే బాగుండు : రాజమౌళి

By:  Tupaki Desk   |   26 Jan 2023 12:00 PM GMT
ఇంత ఆనందానికి కాస్త గ్యాప్ ఉంటే బాగుండు : రాజమౌళి
X
టాలీవుడ్ సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి కి కేంద్ర ప్రభుత్వం పద్మ శ్రీ అవార్డు ప్రకటించడం పట్ల ఆయన అభిమానులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు హర్షం వ్యక్తం చేశాడు. కీరవాణి కుటుంబ సభ్యులు ఈ సందర్భాన్ని ఆస్వాదిస్తున్నాం అని... ఈ ఘన దక్కినందుకు చాలా సంతోషంగా ఉందని పేర్కొంటూ సోషల్‌ మీడియాలో స్పందిస్తూ ఉన్నారు.

పెద్దన్న కీరవాణికి పద్మ అవార్డు దక్కడం పట్ల తన ఆనందాన్ని తెలియజేసేందుకు టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి ఆసక్తికర ట్వీట్‌ చేశాడు. మీ అభిమానుల్లో చాలా మంది అనుకుంటున్నట్లుగా నేను కూడా మీకు లభిస్తున్న అవార్డుల యొక్క ఆనందాన్ని ఒకదాని తర్వాత ఒకటి లభించాలని కోరుకుంటున్నాను.

ఒక అవార్డుకు మరో అవార్డుకు గ్యాప్‌ ఉంటే ఒక అవార్డు తాలూకు ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదించవచ్చు అంటూ రాజమౌళి పేర్కొన్నాడు. మీరు అన్నట్లుగా నేను విశ్వంతో మాట్లాడగలిగితే ప్రతి ఒక్క విజయాన్ని పూర్తిగా ఆస్వాదించే విధంగా గ్యాప్ ఇవ్వమ్మా అంటూ కోరుకుంటాను అంటూ రాజమౌళి ట్వీట్‌ చేశాడు.

గోల్డ్‌ గ్లోబ్‌ అవార్డ్‌ సొంతం చేసుకున్న కీరవాణి నాటు నాటు పాట ఇటీవలే ఆస్కార్‌ నామినేషన్స్ లో చోటు సొంతం చేసుకుంది.

ఇంకా పలు అంతర్జాతీయ వేదికలపై నాటు నాటు సత్తా చాటింది. అమెరికన్ ప్రతిష్టాత్మక రెండు మూడు అవార్డులు కూడా కీరవాణికి సొంతం అయ్యాయి. ఇప్పుడు పద్మ అవార్డు కూడా ఆయనకు దక్కింది.

ఇన్ని అవార్డులు గౌరవాలు చాలా తక్కువ సమయంలో అవ్వడం వల్ల అభిమానులతో పాటు రాజమౌళి కూడా ఆ ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదించలేక పోతున్నాను అంటూ తన పెద్దన్న వద్ద ఇలా వినయంగా కూర్చున్న ఫొటోను షేర్ చేశాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.