బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన వీర సింహారెడ్డి సినిమా మంచి వసూళ్లు సాధిస్తూ దూసుకు పోతుంది. తాజాగా సినిమా యొక్క విజయోత్సవ వేడుకను కూడా చిత్ర యూనిట్ సభ్యులు నిర్వహించారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో రూపొందిన ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ నటించగా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ నటించిన విషయం తెల్సిందే.
తాజాగా వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ.. సినిమాలో ఇంటర్వెల్ సన్నివేశంలో బాలకృష్ణ ను కత్తితో పొడిచి చంపేయాల్సి ఉంటుంది. ఆ సమయంలో నేను చాలా కంగారు పడ్డాను. ఎక్కడ బాలకృష్ణ గారి అభిమానులు నన్ను చంపేస్తారో అని కంగారు పడ్డాను. బాలయ్య కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ నాకు తెలుసు కనుకే అంతగా భయపడ్డాను అంది.
ఆ సన్నివేశాన్ని చేయడానికి నేను ఆందోళన వ్యక్తం చేస్తున్న సమయంలో బాలకృష్ణ గారు నాకు ధైర్యం చెప్పి మరీ సినిమాలోని ఆ సన్నివేశాన్ని చేయించారని.
బాలకృష్ణ గారి సహకారం తోనే ప్రతి సన్నివేశంలో కూడా బాగా నటించగలిగాను అంటూ వరలక్ష్మి శరత్ కుమార్ పేర్కొంది.
గత చిత్రం క్రాక్ లో వరలక్ష్మి శరత్ కుమార్ యొక్క పాత్రకు మంచి పేరు వచ్చింది. వీర సింహారెడ్డి సినిమాలోని భానుమతి పాత్రతో వరలక్ష్మి శరత్ కుమార్ కు మరింత మంచి పేరు దక్కింది. హీరోయిన్ గా కంటే కూడా ఎక్కువగా వరలక్ష్మి శరత్ కుమార్ కు ఇలాంటి పాత్రలు బాగుంటున్నాయి అంటూ తెలుగు ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
వీర సింహారెడ్డి సినిమా హిట్ తో వరలక్ష్మి శరత్ కుమార్ తెలుగు లో మరింత బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తమిళంలో కూడా ఈమె వరుసగా సినిమాల్లో నటిస్తోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందబోతున్న తదుపరి సినిమాలో కూడా వరలక్ష్మి ఉండే అవకాశాలు ఉన్నాయంటూ మీడియా సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.