నాకు నేనుగా ఎదిగాను.. ఆ సినిమా మిస్ అయినందుకు చింతలేదు: తలైవి హీరోయిన్

Mon May 03 2021 20:00:01 GMT+0530 (IST)

I grew up on my own I did not worry about missing that movie

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ - ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్.. గురించి ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. ఎందుకంటే ఎల్లప్పుడూ సంచలన ట్వీట్స్ తో.. మాటలతో వార్తల్లో నిలిచే కంగనా తాజాగా హీరోయిన్ విద్యాబాలన్ గురించి పాజిటివ్ గా మాట్లాడింది. అంతేగాక కంగనా మిస్ చేసుకున్న నేషనల్ అవార్డు ఫిల్మ్ డర్టీపిక్చర్ గురించి స్పందించింది. నిజానికి కంగనాతో 'వన్స్ అపాన్ ఏ టైం ఇన్ ముంబై' అనే సినిమా చేసాడు డైరెక్టర్ మిలన్ లుత్రియా. ఆ సినిమా కాగానే వెంటనే కంగనాతో డర్టీపిక్చర్ ప్లాన్ చేసాడు. కానీ అమ్మడు ఎందుకో ఆ కథలో బలం లేదనుకొని నో చెప్పేసింది. వెంటనే ఆ డర్టీపిక్చర్ మెయిన్ క్యారెక్టర్ సిల్క్ స్మిత పాత్రలోకి విద్యాబాలన్ ఎంట్రీ ఇచ్చింది.షూటింగ్ ముగిసి సినిమా విడుదలై సంచలన విజయం సాధించింది. సిల్క్ స్మిత పాత్రకు గాను విద్యాబాలన్ ఉత్తమనటిగా నేషనల్ అవార్డు అందుకుంది. ఇప్పుడు ఆ విషయం గురించి మాట్లాడుతూ.. "ఆరోజు సినిమాలో దమ్ములేదని అనుకున్నాను. కానీ విద్యాబాలన్ టెర్రఫిక్ యాక్టింగ్ తో మెప్పించింది. నిజానికి నేనైతే విద్యా రేంజిలో పెర్ఫార్మన్స్ చేసేదాన్ని కాదేమో. విద్యా సిల్క్ పాత్రకు పూర్తి న్యాయం చేసింది. నాకు ఇప్పుడు సినిమా మిస్ అయినందుకు బాధలేదు. కానీ అప్పుడు ఆ సినిమాలో ఆ పోటెన్షియాలిటీని గుర్తించలేదని చింతిస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చింది.

నిజానికి కంగనా ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది. అలాగే ఆమె ఖాతాలో ఆల్రెడీ పలు నేషనల్ అవార్డులు కూడా ఉన్నాయి. ఆమె చెప్పేది ఏంటంటే.. తాను ఇప్పటివరకు ఏ ఒక్క బాలీవుడ్ బిగ్ బ్యానర్ లో సినిమా చేయలేదు. అంటే ధర్మప్రొడక్షన్స్ యష్ రాజ్ ఫిలిమ్స్ రాజ్ కుమార్ హిరాని సంజయ్ లీలా భన్సాలి లాంటి ప్రొడక్షన్స్ లో గాని వారితో గాని సినిమాలు చేయలేదు. కానీ నాకు నేనుగా స్టార్డం సంపాదించుకున్నాను. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నానని సంచలన వ్యాఖ్యలు చేసింది కంగనా. ప్రస్తుతం కంగనా మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా.. త్వరలో కంగనా తలైవి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే ఆమె చేతిలో దాకడ్ తో పాటు పలు సినిమాలున్నాయని సమాచారం.