వయసు పెరిగి అందం తగ్గినా నేనేం ఫీల్ అవ్వను

Sun Jan 23 2022 12:12:26 GMT+0530 (IST)

I do not feel the beauty of age and decline

యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ నట వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన శృతి హాసన్ కెరీర్ ఆరంభంలో చాలా ప్లాప్ లు ఎదుర్కొంది. మొదటి సినిమా లోనే బికిని వేసి అందరిని ఆశ్చర్యపరిచిన శృతి హాసన్ ఆ తర్వాత తర్వాత కెరీర్ లో టాప్ స్టార్ గా ఎదిగింది. హీరోయిన్ గా గబ్బర్ సింగ్ తో శృతి హాసన్ కు భారీ విజయం దక్కిన విషయం తెల్సిందే. ఆ సినిమా తర్వాత మళ్లీ శృతి హాసన్ కొత్తగా కెరీర్ ను ప్రారంభించినట్లుగా స్టార్ హీరోయిన్ గా పేరు దక్కించుకునేలా ఈ అమ్మడు మెప్పించింది. హీరోయిన్ గానే కాకుండా మల్టీ ట్యాలెంట్ అనిపించుకుంటూ ఎప్పటికప్పుడు తన స్టార్ డమ్ ను పెంచుకుంటూ వెళ్తున్న శృతి హాసన్ చాలా బోల్డ్ గా మాట్లాడటం మాత్రమే కాకుండా ఆమె పనులు కూడా చాలా బోల్డ్ గా ఉంటాయి అనడంలో సందేహం లేదు.

ఒక స్టార్ హీరో కూతురు అంటే కొన్ని హద్దుల్లో ఉండాలి అనే అభిప్రాయం ఉంటుంది. కాని హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కొత్త లో బికినీ వేసి ఆ తర్వాత నటిగా తనను తాను నిరూపించుకుంటూ వచ్చింది. హీరోయిన్ గా ఎంత ఎదిగినా కూడా తన మ్యూజిక్ ఇంట్రెస్ట్ ను మాత్రం కనబర్చుతూనే వచ్చింది. మ్యూజిక్ షో లను కంటిన్యూ చేస్తూ షో లు ఇస్తూ వస్తున్న ఈ అమ్మడి పుట్టిన రోజు సందర్బంగా ఒక జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది.

 ఆ ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించింది. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సమయంలో నేను మ్యూజిక్ కోర్స్ చేస్తున్నాను. ఆ సమయంలో నాకు ఎలాంటి నటన మెలకువలు తెలియవు. అయినా కూడా నేను నటించాను అంది. మురుగదాస్ దర్శకత్వంలో నటించిన సెవెన్త్ సెన్స్ సినిమా సమయంలో చాలా విషయాలు నేర్చుకున్నట్లుగా చెప్పుకొచ్చింది.

ఇక వయసు పెరుగుతున్న క్రమంలో కొందరు హీరోయిన్లు తమ అందం గురించి ఆందోళన చెందుతూ మరింతగా అందం కాపాడుకునేందుకు ఖర్చు చేస్తూ ఉంటారు. కాని శృతి హాసన్ మాత్రం అలా కాదని అంటోంది. వయసు మీద పడటం అనేది సహజమైన విషయం. దాన్ని ఎవరు దాచలేరు. వయసుకు తగ్గట్లుగా మనుషులు మారుతూ ఉంటారు.

శారీరకంగా నాలో చాలా మార్పులు వచ్చాయి. ముందు ముందు వయసు పెరుగుతున్నా కొద్ది అందం తగ్గుతూ ఉంటుంది. అయినా కూడా నేను ఫీల్ అవ్వను. వయసు లో ఉండే రహస్యం అదే.. దాన్ని ప్రతి ఒక్కరు కూడా స్వాగతించాలి. వయసు పెరుగుతోంది.. అందం తగ్గుతోంది అనే ఆందోళన నాకు అస్సలు లేదు అంటూ శృతి హాసన్ చెప్పుకొచ్చింది. ఇలా అందం పై పెద్దగా శ్రద్ద లేని హీరోయిన్స్ చాలా అరుదుగా ఉంటారు. ఆ జాబితాలో శృతి హాసన్ ముందు ఉంటుందని ఆమె తాజా వ్యాఖ్యలు నిదర్శణం.