బిగ్ బాస్ హోస్ట్ గా ఉండను.. ప్రకటించిన స్టార్ హీరో!

Mon Mar 01 2021 08:00:01 GMT+0530 (IST)

I Don't Want To Be A Bigg Boss Host

ఇప్పుడు దేశంలోని అన్ని ప్రధాన భాషల్లోనూ ఫుల్ క్రేజ్ తో కొనసాగుతోంది 'బిగ్ బాస్' షో. అయితే.. ఈ షోలో కంటిస్టెంట్ల కన్నా ముందుగా షో రన్ చేసే హోస్టులపైనే ఎక్కువ దృష్టి నెలకొంటుంది. హిందీలో సల్మాన్ ఖాన్ తెలుగులో నాగార్జున కన్నడలో కిచ్చ సుదీప్ తమిళంలో కమల్ హాసన్ మలయాళంలో మోహన్‌లాల్ సక్సెస్ ఫుల్ గా ఈ షోలను రన్ చేస్తున్నారు.అయితే.. కన్నడ బిగ్‌బాస్ సీజన్ - 8 త్వరలో ప్రారంభం కాబోతోంది. ఈ క్రమంలో హోస్ట్ కిచ్చ సుదీప్ మీడియాతో మాట్లాడారు. బిగ్‌బాస్ కన్నడ రియాలిటీ షోకు హోస్ట్‌గా ఉండాలని మొదటగా నిర్వాహకులు అడిగినప్పుడు తనపై తనకు అనేక సందేహాలు కలిగాయన్నాడు. ఈ షోను హ్యాండిల్ చేయగలనా? ప్రశ్నించుకొన్నానని చెప్పాడు. తన హోస్టింగ్‌ను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకొంటారో అనే భయం కూడా కలిగిందని చెప్పాడు. మొత్తానికి.. ఐదేళ్ల బాండింగ్ తో హోస్ట్‌గా ఎంట్రీ ఇచ్చినట్టు తెలిపాడు సుదీప్.

వారానికి రెండు రోజులు హోస్ట్ గా చేసేవాన్నని.. కొన్నిసార్లు చాలా ఇబ్బందిగా ఉండేదని చెప్పుకొచ్చాడు. కంటెస్టెంట్ల మధ్య గొడవల వల్ల తాను చాలా ఇబ్బంది పడ్డానని తెలిపాడు సుదీప్. గొడవలు బాగా జరిగినప్పుడు బ్రేక్ ఇచ్చి వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉండేవాడనని ఆ తర్వాత కంటెస్టెంట్లు కోపాన్ని తగ్గించుకోనే వారని గుర్తు చేసుకున్నాడు సుదీప్.

అయితే.. ఐదు సీజన్లు పూర్తయిన తర్వాత 6వ సీజన్‌కు తాను హోస్ట్‌గా వ్యవహరించను అని నిర్వాహకులకు స్పష్టం చేశాడట సుదీప్. తర్వాత హోస్ట్‌ను వెతకండి అంటూ చెప్పాడట. కానీ.. నిర్వాహకులు అందుకు ఒప్పుకోలేదు. ఎలాగోలా కన్వీన్స్ చేసి మళ్లీ హోస్ట్ గా కొనసాగేలా ఒప్పించారని చెప్పాడీ హీరో.

ఫిబ్రవరి 28న సీజన్ - 8 ప్రారంభం కాబోతోంది. ఈ సీజన్లోని కంటెస్టెంట్ల పేర్లు మీడియాలో వైరల్ అవుతున్నాయి. రఘు గౌడ రాగిణి ద్వేవేది గీతా భారతీ భట్ ఆర్జే రాజేష్ సమీక్ష కిరణ్ శ్రీనివాస్ సునీల్ రావు అనుష రంగనాథ్ సుక్రుత నాగ్ తబ్లా నాని రజనీ తరంగ విశ్వ హనుమంత నయన శరత్ పేర్లు బయటకు వచ్చాయి. మరి వీరిలో ఎంత మంది షోలో కనిపిస్తారో చూడాలి.