Begin typing your search above and press return to search.

మినిమం మేకప్‌ లేకుండా నటించాడట

By:  Tupaki Desk   |   30 Jun 2020 5:45 AM GMT
మినిమం మేకప్‌ లేకుండా నటించాడట
X
హీరో హీరోయిన్స్‌ మాత్రమే కాకుండా సినిమాలో కనిపించే ప్రతి ఒక్కరు కూడా మేకప్‌ తోనే నటిస్తారు. అత్యంత అరుదైన సమయంలో మాత్రమే నటీనటులు మేకప్‌ లేకుండా నటిస్తారు. హీరోలు మేకప్‌ లేకుండా నటించడం కేవలం కోలీవుడ్‌ లో మాత్రమే చూస్తూ ఉంటాం. టాలీవుడ్‌ హీరోలు మేకప్‌ లేకుండా నటించడం అనేది చాలా చాలా తక్కువ. అలాంటిది అల్లరి నరేష్‌ తన తాజా చిత్రం ‘నాంది’ కోసం మేకప్‌ లేకుండా నటించాడు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ప్రకటించాడు.

నేడు అల్లరి నరేష్‌ పుట్టిన రోజు. ఈ సందర్బంగా పలు మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెళ్లడి చేశాడు. ప్రస్తుతం రెండు సినిమాలతో అల్లరోడు సిద్దంగా ఉన్నాడు. అందులో బంగారు బుల్లోడు చిత్రం విడుదలకు రెడీగా ఉంది. మరో వైపు నాంది చిత్రం షూటింగ్‌ చివరి దశలో ఉంది. నాంది చిత్రంపై జనాల్లో ఆసక్తి ఉంది.

ఇప్పటికే వచ్చిన ఫస్ట్‌లుక్‌ మరియు ఇతర టాక్‌ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. నాంది సినిమాలో నరేష్‌ పూర్తి నగ్నంగా కూడా నటించినట్లుగా పోస్టర్స్‌ ను చూస్తుంటే అనిపిస్తుంది. ఇప్పటి వరకు ఎన్నో కామెడీ సినిమాలు చేసిన నరేష్‌ ఈ చిత్రంలో చాలా సీరియల్‌ రోల్‌ లో కనిపించబోతున్నాడు. గతంలో నరేష్‌ చేసిన సీరియస్‌ రోల్స్‌ సక్సెస్‌ అయ్యాయి. అందుకే ఈ చిత్రం కూడా తప్పకుండా ఆకట్టుకుంటుందనే నమ్మకంతో నరేష్‌ ఉన్నట్లుగా కనిపిస్తున్నాడు.