ఫుల్ ఎనర్జీ తో యంగ్ టైగర్

Thu Mar 14 2019 13:52:49 GMT+0530 (IST)

I Cannot Forget Shakthi Said Jr NTR

ఆర్ ఆర్ ఆర్ ప్రెస్ మీట్ లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మంచి హుషారుగా కనిపించాడు. స్పీచ్ ప్రారంభంలో ఎన్నడూ లేనిది ఈ రోజు కొంత నెర్వస్ గా ఉన్నానని చెప్పి ఆ తర్వాత మాత్రం తనదైన శైలిలో ముచ్చట్లు కలిపేశాడు. వీలు దొరికినప్పుడంతా మీడియా  అడిగిన ప్రశ్నలకు చలాకిగా సమాధానం ఇచ్చాడు. నాలుగోసారి జక్కన్నతో సినిమా చేయడం ఈసారి ప్రాణ స్నేహితుడైన చరణ్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా ఆనందాన్ని కలిగించిందని చెప్పుకొచ్చాడు.ఒక ప్రశ్నకు సమాధానంగా ఇది రాజమౌళి కాకుండా ఇంకో దర్శకుడు తీసుకువస్తే మీరిద్దరూ చేసేవారా అనే ప్రశ్నకు నేరుగా సమాధానం చెప్పకపోయినా ఇది జక్కన్న కాబట్టే సాధ్యమయ్యింది అనే రీతిలో బదులు చెప్పడం ద్వారా ఇంకొకరిని నమ్మేవారం కాదని చెప్పి తారక్ తమ ఉద్దేశాన్ని స్పష్టం చేశాడు

హిస్టారికల్ ఫిక్షన్ లో నటించడం మొదటి సారి అన్న ప్రశ్నకు చరణ్ అవును అని సమాధానం ఇస్తే జూనియర్ ఎన్టీఆర్ శక్తి ప్రస్తావన తీసుకువచ్చి దాన్నింకా మర్చిపోలేదని గుర్తు చేయడం అసలు ట్విస్ట్. ఒక మీడియా ప్రతినిది స్టేజి వెనుక పోస్టర్ లో చరణ్ నుదురు మీద వెంట్రుకలు కింద పడేలా చూపించి తారక్ కు అలా చేయలేదేం అని అడిగాడు.

దానికి జూనియర్ బదులిస్తూ మీరిలా కన్ఫ్యూజ్ అవుతారనే గుర్తు పట్టకుండా ఇద్దరూ టోపీలు పెట్టుకుని వస్తే భలే పట్టేశారే అంటూ నవ్వేశాడు. మొత్తానికి మాటలతో పాటు చేతల్లో కూడా జూనియర్ లో కొత్త ఎనర్జీ కనిపించింది. మొదట్లో స్లోగా అనిపించినా తర్వాత బిగ్ బాస్ స్టైల్ లో తనదైన మార్కు పంచులతో మాంచి ఉత్సాహాన్ని అయితే తీసుకొచ్చాడు