Begin typing your search above and press return to search.

న‌జ్రియా ఇంట హైద‌రాబాద్ బిర్యానీ బెడిసి కొట్టిందా!

By:  Tupaki Desk   |   7 Jun 2023 2:00 PM GMT
న‌జ్రియా ఇంట హైద‌రాబాద్ బిర్యానీ బెడిసి కొట్టిందా!
X
మాలీవుడ్ బ్యూటీ న‌జ్రియా న‌జీమ్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచిత‌మే. 'అంటే సుంద‌రానికీ' సినిమాతో లాంచ్ అయిన అమ్మ‌డు అటుపై మ‌ళ్లీ క‌నిపించ‌లేదు. ఆ సినిమా వైఫ‌ల్యంతో అవ‌కాశాలు రాలేదు. ఆమె కూడా ఇక్క‌డ జ‌ర్నీని అంత సీరియ‌స్ గా తీసుకుని ప్ర‌య‌త్నాలు చేయ‌లేదు. మ‌రి తాను సాంధించ‌లేనిది భ‌ర్త ఫ‌హాద్ ఫాజిల్ సాధిస్తున్నాడ‌ని అనుకుందో! ఏమో గానీ ఇక్క‌డ కెరీర్ వెరీ లైట్ అనేసింది. ఆ సంగ‌తి ప‌క్క‌న‌బెడితే!

సుంద‌రం రిలీజ్ స‌మ‌యంలో అమ్మ‌డు నెట్టింట ఏ రేంజ్లో హ‌ల్చ‌ల్ చేసిందో తెలిసిందే. హైద‌రాబాద్ స‌హా తెలుగింట రుచుల‌న్నింటిని జుర్రేసి ఆహా..ఓహా అంటూ పొగిడేసింది. ముఖ్యంగా హైద‌రాబాద్ బిర్యానీ వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ బిర్యానీ అంటూ స‌ర్టిఫై చేసింది.

నాన్ వెజ్ వంట‌కాలు అన్నింటిని సూప‌ర్ అంటూ పొగిడేసింది. త‌న ఇంటి ఫుడ్ కూడా ఇంత టేస్ట్ గా ఉండ‌ద‌ని ఒకేసారి అన్ని వంట‌కాలు లాగించేసింది. అప్పుడే అమ్మ‌డు హైద‌రాబాద్ బిర్యానీ ప్రిప‌రేష‌న్ కూడా తెలుసుకుంది.

బిర్యానీ ఎలా త‌యారు చేస్తారు. అందులో వాడే ఇంగ్రిడియన్స్ ఏంటి అంటూ ఓ చీటి రాసిపెట్టుకుంది. ఇంటికెళ్లిన త‌ర్వాత ఓరోజు త‌ప్ప‌కుండా ట్రై చేస్తాన‌ని చెప్పింది. మ‌రి ఆ ప్ర‌య‌త్నం తాజాగా చేసిందా? అంటే చేసింద‌నే తెలుస్తుంది.

వారం రోజుల క్రిత‌మే అమ్మ‌డు నైట్ డిన్న‌ర్ లో భాగంగా హైద‌రాబాదీ బిర్యానీ వంట‌కం ట్రై చేసిందిట‌. ఇక్క‌డ స్టైల్ కి కావాల్సిన అన్ని ర‌కాల ప‌దార్ధాలు సిద్దం చేసుకుని కొద్ది మొతాదు లో బిర్యానీ వండిందిట‌.

దాదాపు మూడు గంట‌లు పాటు శ్ర‌మించి బిర్యానీ సిద్దం చేసిందిట‌. కానీ టేస్ట్ బెడిసి కొట్టిందిట‌. హైద‌రాబాదీ బిర్యానీ టేస్ట్ ఏ మాత్రం రాలేదుట‌. ఆవిడ చేతి వంట‌కం ఆమెకే న‌చ్చ‌లేదుట‌. మ‌రి హ‌బ్బీ ఫ‌హాద్ ఫాజిల్ కి వ‌డ్డించిందో ? లేదో?. ఇక అమ్మ‌డి కెరీర్ సంగ‌తి చూస్తే మాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తున్న‌ట్లు లేదు.' అంటే సుంద‌రానికీ' త‌ర్వాత ఏ ప్రాజెక్ట్ క‌మిట్ అవ్వ‌లేదు.