Begin typing your search above and press return to search.

ఫస్ట్‌ టైమ్ ఇండియన్‌ షో లో స్టార్‌ హీరోయిన్‌ భర్త..!

By:  Tupaki Desk   |   1 July 2022 2:30 AM GMT
ఫస్ట్‌ టైమ్ ఇండియన్‌ షో లో స్టార్‌ హీరోయిన్‌ భర్త..!
X
బాలీవుడ్ తో పాటు దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులను ఆకర్షించే టాక్ షో కాఫీ విత్ కరణ్‌. ఈ షో ప్రారంభం అయ్యి చాలా కాలం అయ్యింది. ఇప్పటికే ఎంతో మంది సెలబ్రెటీలు ఈ షో ద్వారా తమ వ్యక్తిగత విషయాలను.. రహస్యాలను జనాలతో షేర్‌ చేసుకున్నారు. కరణ్‌ షో అంటే ఖచ్చితంగా అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి.. తప్పకుండా మంచి కంటెంట్‌ లభిస్తుంది అన్నట్లుగా టాక్‌ ఉంది.

ప్రస్తుతం ఈ సీజన్ డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌ లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఇన్నాళ్లు టెలివిజన్‌ లో చూసిన జనాలు ఓటీటీ ద్వారా ఈ షో ను ఎంజాయ్‌ చేస్తున్నారు. ఈ సీజన్ లో కూడా ఎప్పటిలాగే ప్రముఖులను తీసుకు వచ్చి వారి యొక్క అంతరంగంను ఆవిష్కరిస్తున్నారు.

తాజాగా ప్రియాంక చోప్రా మరియు ఆమె భర్త నిక్ జోనస్ లతో కరణ్ షో షూటింగ్‌ చేసినట్లుగా సమాచారం అందుతోంది.

ఇప్పటి వరకు ప్రియాంక చోప్రా అనేక షో ల్లో కనిపించి సందడి చేసిన విషయం తెల్సిందే. ఇప్పుడు ఆమె తో పాటు నిక్ జోనస్ కూడా కాఫీ విత్‌ కరణ్‌ టాక్‌ షో లో సందడి చేయబోతున్నాడు. గతంలో పలు సందర్బాల్లో కరణ్ మరియు నిక్‌ జోనస్ లు కలిశారు. ఆ సమయంలోనే పలు విషయాలను వారిద్దరు మాట్లాడుకోవడం జరిగిందట. ఇప్పుడు ఇద్దరు టాక్‌ షో లో సందడి చేయబోతున్నారు.

ఈ షో లో పాల్గొనేందుకు గాను ప్రియాంక చోప్రా మరియు నిక్‌ జోనస్ లు అత్యంత భారీ పారితోషికంను తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు ఏ సెలబ్రెటీ కపుల్ కూడా తీసుకోని రేంజ్ లో ఈ షో లో పాల్గొంటున్నందుకు గాను ప్రియాంక చోప్రా మరియు నిక్ జోనస్ లు తీసుకున్నారనే వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికే పలు అమెరికన్‌ షో ల్లో కలిసి పాల్గొన్న నిక్ జోనస్ మరియు ప్రియాంక చోప్రా లు మొదటి సారి ఒక ఇండియన్ టాక్ షో లో సందడి చేయబోతున్నారు. వీరిద్దరు ఖచ్చితంగా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడం ఖాయం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.