Begin typing your search above and press return to search.

అక్కినేని 'ఏజెంట్' భారీ డీల్ గురించి మీకు తెలుసా?

By:  Tupaki Desk   |   25 May 2022 1:30 PM GMT
అక్కినేని ఏజెంట్ భారీ డీల్ గురించి మీకు తెలుసా?
X
అక్కినేని హీరో అఖిల్‌ గట్టి కమర్షియల్‌ సక్సెస్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆయన ఇండస్ట్రీలో అడుగు పెట్టి చాలా కాలం అయ్యింది... పలు సినిమాల్లో చేసినా కూడా కమర్షియల్‌ గా స్టార్‌ హీరోగా నిలదొక్కుకునే సినిమా మాత్రం పడలేదు. ఇప్పుడు ఆయన చేస్తున్న ఏజెంట్‌ సినిమా ఖచ్చితంగా ఇండస్ట్రీలో స్టార్‌ డమ్‌ తెచ్చి పెట్టడంతో పాటు పెద్ద హీరోల సరసన అఖిల్‌ ను నిలుపుతుందనే నమ్మకంను అక్కినేని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.

కమర్షియల్‌ బ్లాక్ బస్టర్స్ ను తెరకెక్కించిన దర్శకుడు సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఏజెంట్‌ సినిమా పక్కాగా ఒక బ్లాక్ బస్టర్‌ మూవీగా నిలుస్తుందనే నమ్మకం ను ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు. అక్కినేని ఫ్యాన్స్ తో పాటు తెలుగు ప్రేక్షకులు అంతా కూడా ఏజెంట్‌ కోసం వెయిట్‌ చేస్తున్నారు. ఇంటర్‌ పోల్‌ ఆఫీసర్ గా అఖిల్ ఈ సినిమాలో కనిపించబోతున్న విషయం తెల్సిందే.

ఏజెంట్‌ సినిమా ఆగస్టు లో విడుదల కాబోతుంది. భారీ థియేటర్ రిలీజ్ కు ప్లాన్‌ చేస్తున్న ఈ సమయంలోనే ఓటీటీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌ వీడియో వారు కొనుగోలు చేయడం జరిగిందట. సినిమాలో అఖిల్ తో పాటు మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టీ ఉండటం మరియు సురేందర్‌ రెడ్డి గత చిత్రాల వల్ల ఏజెంట్ సినిమాకు భారీ మొత్తంను ప్రైమ్‌ వారు కోట్‌ చేశారని తెలుస్తోంది.

హీరోగా అఖిల్‌ ఏజెంట్‌ సినిమా తో ఖచ్చితంగా ఒక మంచి కమర్షియల్‌ బ్రేక్ ను దక్కించుకుంటాడనే నమ్మకం తో యూనిట్‌ సభ్యులు ఉన్నారు. సినిమాలో అఖిల్‌ లుక్ కు ఇప్పటికే అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇప్పటి వరకు చాలా సాఫ్ట్‌ లుక్ లో.. కాస్త రెగ్యులర్‌ గా కనిపించిన అఖిల్‌ మొదటి సారి ఫిజిక్ ను పూర్తి గా మార్చి కొత్తగా కనిపించేందుకు చాలా కష్టపడ్డాడు అని ఆయన వీడియోలు ఫోటోలు చూస్తే అర్థం అవుతుంది.

ఏజెంట్‌ సినిమా కోసం అఖిల్‌ చాలా సమయం కేటాయించాడు. మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌ విజయాన్ని సొంతం చేసుకున్నా కూడా అది కమర్షియల్‌ గా అఖిల్‌ కోరుకున్న స్థానానికి చేర్చలేక పోయింది. అందుకే ఏజెంట్‌ కోసం కాస్త ఏఎక్కువ సమయం అయినా పర్వాలేదని ఫిజిక్‌ విషయం మొదలు పెట్టి ప్రతి ఒక్క విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుని సినిమా ను చేయడం జరిగింది.

ఎన్నో హిట్ సినిమాలకు స్క్రిప్ట్‌ వర్క్‌ చేసిన వక్కంతం వంశీ ఈ సినిమాకు రచయితగా వ్యవహరిస్తున్నాడు. ఏకే ఎంటర్‌ టైన్మెంట్స్ బ్యానర్‌ లో ఈ సినిమాను అనీల్‌ సుంకర నిర్మిస్తున్నాడు.