దుమ్మురేపుతున్న సారంగదరియా జానపదం.. 'లవ్ స్టోరీ'లో..!

Sat Mar 06 2021 16:00:02 GMT+0530 (IST)

Huge Views For Saranga Dariya

ప్రస్తుతం యూట్యూబ్ ట్రెండింగ్ పాటలలో తెలుగు నుండి సారంగదరియా సాంగ్ సంచలనం సృష్టిస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఫిబ్రవరి 28న ఈ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం యూట్యూబ్ నంబర్ 2 ట్రెండింగ్‌లో కొనసాగుతుంది. అక్కినేని నాగచైతన్య సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా లవ్ స్టోరీ. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నుండి ప్రస్తుతం సారంగదరియా సాంగ్ యూట్యూబ్ సెన్సేషన్ అయింది. తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తున్న ఈ పాటను మంగ్లీ ఆలపించగా.. సుద్దాల అశోక్ తేజ లిరిక్స్ అందించారు. ఇప్పటికే ఈ పాట యూట్యూబ్ వేదికగా రెండుకోట్లకు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. ఇంకా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. అయితే ఈ పాటపల్లవి వినగానే తెలంగాణ జానపదం అనే గుర్తుకొస్తుంది.ముఖ్యంగా పాట లిరిక్స్.. దాని కుడిభుజం మీద కడవ దాని గుత్తేపు రైకలు మెరియా.. అది రమ్మంటే రాదురా సెలియా దానిపేరే సారంగదరియా.. అంటూ సాగే ఈ పాట ట్యూన్ ఇప్పటిది కాదు. గతంలో రేలారేరేలా సింగర్ కోమల ఆలపించిన పాట అది. తాజాగా సుద్దాల లవ్ స్టోరీ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ ఉట్టిపడేలా లిరిక్స్ చేంజ్ చేశారు. కేవలం పల్లవి అలాగే ఉంచి చరణాలలో మార్పులు చేసి.. ప్రస్తుతం తెలంగాణ అమ్మాయిల స్వభావం ఎలా ఉందో అందంగా వివరించారు. మంగ్లీ పాడిన ఈ పాటకు హీరోయిన్ సాయిపల్లవి స్టెప్స్ అదిరిపోయాయనే కామెంట్స్ సోషల్ మీడియాలో హోరెత్తుతున్నాయి.

తాజాగా సుద్దాల ఈ సారంగదరియా పాట లిరిక్స్ పై స్పందించారు. సూర్మా పెట్టిన చురియా.. అంటే కాటుక పెట్టిన కత్తి అంటూ తెలంగాణ అమ్మాయిల స్వభావం అదేనంటున్నారు ఆయన. ప్రస్తుతం పాటలతో ట్రెండ్ క్రియేట్ చేస్తున్న లవ్ స్టోరీ మూవీ.. ఏప్రిల్ 16న థియేటర్లలో విడుదల కాబోతుంది..అయితే ఇక్కడ విశేషం ఏంటంటే.. సారంగదరియా ఒరిజినల్ సింగర్ కోమల.. లవ్ స్టోరీ ప్రీ-రిలీజ్ వేడుకలో పాడనుంది. డైరెక్టర్ కమ్ముల సినిమాలలో అమ్మాయిల పాత్రలు బలంగా ఉంటాయి.  ఈ సినిమాలో కూడా సాయిపల్లవి పాత్రను అదే రేంజిలో తీర్చిదిద్దినట్లు తెలుస్తుంది. చూడాలి మరి ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో..!