Begin typing your search above and press return to search.

ప్లాప్‌ లతో కలిసి వచ్చింది.. కల నెరవేరింది

By:  Tupaki Desk   |   14 Jun 2021 11:30 PM GMT
ప్లాప్‌ లతో కలిసి వచ్చింది.. కల నెరవేరింది
X
టాలీవుడ్‌ లో ప్రస్తుతం స్టార్‌ హీరోయిన్స్‌ జాబితా తీస్తే ఖచ్చితంగా అందులో మొదటి వరుసలో ముద్దుగుమ్మ పూజా హెగ్డే ఉంటుంది అనడంలో సందేహం లేదు. ప్రస్తుతం హిందీ.. తెలుగు.. తమిళ చిత్రాల్లో నటిస్తూ మోస్ట్‌ బిజీ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకున్న పూజా హెగ్డే కెరీర్‌ ఆరంభంలో చాలా ఒడిదొడుకులు ఎదుర్కొంది. తెలుగు లో నటించిన రెండు సినిమా లు యావరేజ్ గా నిలువడంతో పాటు హిందీలో నటించిన మెహెంజదారో సినిమా అట్టర్ ప్లాప్ గా నిలిచింది. ఆ సమయంలో పూజా హెగ్డే మళ్లీ సినిమాల్లో ఆఫర్లు పొందేందుకు చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నట్లుగా పేర్కొంది. మొత్తానికి తన కెరీర్‌ లో చాలా ఒడిదొడుకులు ఎదుర్కొన్నట్లుగా చెప్పుకొచ్చింది.

కెరీర్‌ ఆరంభంలోనే ప్లాప్‌ లను చవిచూడటం తనకు కలిసి వచ్చిందని పేర్కొంది. ఇప్పుడు ఎలాంటి ఒత్తడి లేకుండా సినిమాలు చేయగలుగుతున్నట్లుగా చెప్పుకొచ్చింది. ఒక సినిమాలో నటించే సమయంలో ఖచ్చితంగా సూపర్ హిట్‌ అవుతుందనే నమ్మకంతోనే చేస్తాము. కాని ఆ సినిమా ఫలితం తారుమారు అయితే చేసేది ఏమీ లేదు. ఒక సినిమా చేసిన తర్వాత విడుదల అయిన రోజే ఆ సినిమా గురించి మర్చిపోతాం. ఆ సినిమా నుండి బయటకు వచ్చిన తర్వాత ప్లాప్ అయినా మరేం జరిగినా కూడా పెద్దగా పట్టించుకోను అంటూ ముద్దుగుమ్మ పూజా హెగ్డే చెప్పుకొచ్చింది.

తనకు పాన్ ఇండియా సినిమాలు చేయాలని కోరిక ఉండేది. తాను కల కన్నట్లుగానే పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఈ సందర్బంగా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రాధే శ్యామ్‌ మొదలుకుని పలు సినిమాల్లో ఈమె నటిస్తుంది. సౌత్ లో నటిస్తున్న సినిమాలు ఉత్తరాది ప్రేక్షకుల ముందుకు కూడా వెళ్తున్నాయి. ఇదే సమయంలో ఈమె సల్మాన్‌ ఖాన్‌ చిత్రంలో నే కాకుండా మరో స్టార్‌ హీరో సినిమాలో కూడా ఆఫర్‌ ను దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది. ఆ రెండు సినిమాలతో హిందీలో ఈ అమ్మడు మరింత బిజీ అయ్యనో చూడాలి.