Begin typing your search above and press return to search.

నెవ్వ‌ర్ బిఫోర్‌: RAPO బుల్ ఫైట్ కోసం భారీ బ‌డ్జెట్

By:  Tupaki Desk   |   29 March 2023 9:25 AM GMT
నెవ్వ‌ర్ బిఫోర్‌: RAPO బుల్ ఫైట్ కోసం భారీ బ‌డ్జెట్
X
ఎన‌ర్జిటిక్ హీరో రామ్ పోతినేని ప్ర‌తిసారీ స్క్రిప్టుల ప‌రంగా వైవిధ్యం కోసం ప్ర‌య‌త్నిస్తున్నాడు. అన్నివేళ‌లా ప్ర‌త్యేకంగా క‌నిపించాల‌నే త‌ప‌న‌ను క‌న‌బ‌రుస్తున్నాడు. ఇంత‌కుముందు పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో ఊర మాస్ 'ఇస్మార్ట్ శంక‌ర్' పాత్ర‌తో అద్భుతంగా ఆక‌ట్టుకున్నాడు. ఆ త‌ర్వాత లింగుస్వామి ద‌ర్శ‌క‌త్వం లో వారియ‌ర్ లో డిఫ‌రెంట్ యాక్ష‌న్ పాత్ర‌లో ట్రై చేసాడు. ఆ రెండిటి కంటే భిన్నంగా మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి రామ్ ని ఏ విధంగా చూపించ‌బోతున్నాడు? అన్న‌దే ఇప్పుడు అంద‌రి ముందు ఉన్న ప్ర‌శ్న‌.

బోయ‌పాటి ఎంపిక‌లు అత‌డు రాసుకునే క్యారెక్ట‌ర్ల‌కు బాల‌కృష్ణ రేంజు స్టార్ అయితేనే స‌రిపోతాడు. అంత‌కు లో లెవ‌ల్లో స్టార్లు ఎవ‌రూ అత‌డి స్క్రిప్టుల‌కు స‌రితూగ‌రు. కానీ ఇప్పుడు యువ‌హీరో రామ్ తో అత‌డు ఎలాంటి స్క్రిప్టుతో తెర‌పై ఆవిష్క‌రిస్తున్నారు? అన్న‌ది రాపో అభిమానుల్లో ఉత్కంఠ రేపుతోంది.

తాజా గుస‌గుస‌ల ప్ర‌కారం.. బోయపాటి సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ లలో అదరగొట్టాడని.. రామ్ ఎనర్జీని పూర్తి స్థాయిలో ఉపయోగించాడని స‌మాచారం. ముఖ్యంగా ఈ చిత్రంలో బుల్ ఫైట్ హై పంచ్ లో అల‌రించ‌నుందిట‌. బోయ‌పాటి ఎప్ప‌టిలానే మాస్ యాక్ష‌న్ ని మ‌రో లెవ‌ల్లో ఆవిష్క‌రిస్తున్నాడ‌ని.. యాక్షన్ ప్రియు సీట్ అంచుమీద కూచుని సినిమా చూస్తార‌ని టాక్ వినిపిస్తోంది.

ఆ రేంజు అనుభూతిని అందించాలని యాక్షన్ కొరియోగ్రాఫర్ లను బోయ‌పాటి కోరాడు. సినిమాలో ఈ భారీ ఎద్దుల ఫైట్ సీక్వెన్స్ చాలా కీలకం. అందుకే దీన్ని 11 రోజుల పాటు అత్యంత భారీ ఖర్చుతో షూట్ చేశారు. ఈ యాక్షన్ సీక్వెన్స్ కోసం హై డ్యూటీ లైట్లను ఉపయోగించారు. ఈ లైట్లకు విద్యుత్ అందించడానికి మొదటిసారిగా 28 జనరేటర్లను ఉపయోగించారు.

ఒక ప్రైవేట్ స్టూడియో అన్ని జనరేటర్లను ఏకకాలంలో అందించలేకపోవడంతో మేకర్స్ అదనంగా బ‌య‌ట నుంచి జనరేటర్లను అద్దెకు తెచ్చార‌ట‌. రామ్- ఊర్వశి రౌతేలపై ప్రత్యేక గీతం కోసం భారీ డ్యూటీ పవర్ - లైటింగ్ ని ఉపయోగించారని వినికిడి.

బోయ‌పాటి ఇటీవ‌ల సాంకేతిక‌త ప‌రంగా అప్ టు డేట్ గా ఉంటున్నారు. రెగ్యుల‌ర్ మాస్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు తీసినా అందులో టెక్నిక‌ల్ అంశాల‌కు ప్రాధాన్య‌త‌నిస్తున్నారు. మంచి మాస్ స్టోరీకి సాంకేతికంగా అన్ని వ‌న‌రులు స‌మ‌కూరితే విజ‌యం సాధించ‌డం పెద్ద క‌ష్ట‌మేమీ కాదు. ఆ మేర‌కు నిర్మాత‌లు బోయ‌పాటి కోరింద‌ల్లా అందిస్తున్నార‌ని స‌మాచారం. అఖండ లాంటి భారీ హిట్ చిత్రాన్ని అందించాక ఇప్పుడు యువ‌హీరోతో మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టాల‌ని బోయ‌పాటి క‌సిగా ప‌ని చేస్తున్నారు. ఆశించిన‌ది నిజ‌మ‌వుతుంద‌ని ఆకాంక్షిద్దాం.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.