Begin typing your search above and press return to search.

జియా ఖాన్ త‌ర్వాత సుశాంత్ సింగ్ కే అంత అన్యాయం?!

By:  Tupaki Desk   |   21 Feb 2021 10:30 AM GMT
జియా ఖాన్ త‌ర్వాత సుశాంత్ సింగ్ కే అంత అన్యాయం?!
X
బిగ్ బి అమితాబ్ స‌ర‌స‌న నిశ్శ‌బ్ధ్ చిత్రంలో న‌టించింది యువ‌న‌టి జియాఖాన్. 60 ఏళ్ల ముస‌లాయ‌న‌తో ప్రేమ‌లో ప‌డే టీనేజీ యువ‌తిగా జియా న‌ట‌న‌కు యువ‌త‌రం సెల్యూట్ కొట్టారు. ఆ త‌ర్వాత కెరీర్ సాఫీగా సాగుతుండ‌గానే ఊహించ‌ని ఘ‌ట‌న‌. త‌న ప్రియుడు సూర‌జ్ పాంచోళితో జియా గొడ‌వ‌ప‌డ‌డం.. అటుపై ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం సంచ‌ల‌న‌మైంది. నాడు జియా ఆత్మ‌హ‌త్య పెను సంచ‌ల‌న‌మే అయ్యింది. ఒక గ‌దిలో బెడ్ పై ఫ్యాన్ కి ఉరి వేసుకుని జియా క‌నిపించింది. దానిని పోలీసులు మిస్టీరియ‌స్ డెత్ గా రికార్డుల్లో చేర్చారు. చాలాకాలం కోర్టుల ప‌రిధిలో దీనిపై విచార‌ణ సాగింది. ఇప్ప‌టికీ సాగుతూనే ఉంది. కానీ ఏ ప్ర‌యోజనం లేకుండా పోయింది.

ఇక ఇటీవ‌లే సుశాంత్ సింగ్ మ‌ర‌ణానికి జియా మ‌ర‌ణానికి మ‌ధ్య సారూప్య‌త‌లు క‌నిపించాయ‌న్న‌ది సోష‌ల్ మీడియాల్లో నెటిజ‌నుల ఆవేద‌న‌. చంపేశాకే ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డ‌ట్టు ఆ ఇద్ద‌రిపైనా క‌ట్టుక‌థ‌లు క‌ల్పించార్న ఆవేద‌న వ్య‌క్త‌మైంది. జియా ఖాన్ 33వ బ‌ర్త్ డే(జ‌యంతి) వేళ దీనిపై వాడి వేడిగా చ‌ర్చ సాగుతోంది.

బాలీవుడ్ లో ఆ ఇద్ద‌రు ప్ర‌తిభావంతులు అన్యాయ‌మైపోయార‌న్న నివేద‌న సోష‌ల్ మీడియాని హీటెక్కిస్తోంది. ప్ర‌తిభావంతుడైన సుశాంత్ సింగ్ కూడా ఫ్యాన్ కి ఉరి వేసుకుని మ‌ర‌ణించార‌న్న ప్ర‌చారం సాగింది. కానీ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మ‌ర‌ణం వెన‌క ప్రియురాలు త‌న‌కు స‌న్నిహితులైన బాలీవుడ్ మాఫియా ఉంద‌ని తొలి నుంచి ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. దీనిపై ఈడీ ద‌ర్యాప్తు.. సీబీఐ ద‌ర్యాప్తు సాగినా కానీ ఇప్ప‌టికీ ఏదీ తేల‌లేదు.