అజిత్ ఎంత సింపుల్ అంటే.. వీడియో వైరల్

Thu Jul 07 2022 09:00:01 GMT+0530 (India Standard Time)

How simple Ajith is The video is viral

తమిళ చిత్ర పరిశ్రమలో అత్యధిక మార్కెట్ ఉన్న హీరోలలో అజిత్ కుమార్ ఒకరు. అతను ఎలాంటి సినిమా చేసిన కూడా అక్కడ బాక్స్ ఆఫీస్ వద్ద ఈజీగా 100 కోట్ల కలెక్షన్స్ అందుకుంటుంటాయి. ఇక అజిత్ కుమార్ కు స్టార్ హోదా ఎంత ఉన్నప్పటికీ కూడా చాలా సింపుల్ గానే ఉండేందుకు ప్రయత్నం చేస్తాడు. ఇక ఈ హీరో కొన్ని చిన్న చిన్న మూమెంట్స్ లోనే ఎక్కువ సంతోషాన్ని వెతుక్కుంటూ ఉంటాడు.అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. అజిత్ కు బైక్ రేసింగ్ అంటే ఎంతగానో ఇష్టం అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఏమాత్రం గ్యాప్ దొరికినా కూడా బైక్ వేసుకుని వివిధ ప్రాంతాలను చుట్టేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు ఒంటరిగా బైక్ రేసింగ్ చేసినా అజిత్ కుమార్ మరి కొన్నిసార్లు తన స్నేహితులతో కలిసి లాంగ్ రైడ్స్ కు వెళ్ళిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

ఇక రీసెంట్ గా విదేశాల్లో కూడా ఒక బీఎండబ్ల్యూ బైక్ తీసుకొని చాలా హ్యాపీగా ట్రావెల్ చేశాడు. మధ్య మధ్యలో ఎవరైనా అభిమానులు కలిస్తే వారితో కూడా ఫోటోలు దిగుతూ తన ఆనందాన్ని షేర్ చేసుకుంటూ వచ్చాడు. ఇక రీసెంట్గా లండన్ లో కూడా అజిత్ కుమార్ షాపింగ్ చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అతను షాప్ కు సంబంధించిన వ్యక్తితో ప్రత్యేకంగా ఫోటోకు కూడా స్టిల్ ఇచ్చాడు.

డిపార్ట్మెంట్ స్టార్ లో తనకు కావాల్సినవన్నీ కూడా కొనుక్కున్న అజిత్ కుమార్ అక్కడ క్యాషియర్ తో కూడా కొంతసేపు ముచ్చటించడం అభిమానులను ఎంతగానో కట్టుకుంది. అజిత్ కుమార్ ఎంత సింపుల్ గా ఉంటారో మరోసారి అర్థమయింది అంటూ అతను నిజమైన స్టార్ అని కూడా అభిమానులు ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

ఇక అజిత్ కుమార్ వాలిమై సినిమాతో సక్సెస్ అందుకున్న అనంతరం ఇప్పుడు హెచ్ వినోద్ దర్శకత్వంలో మరొక సినిమా చేయాలని రెడీ అవుతున్నాడు. అలాగే విగ్నేష్ శివన్ దర్శకత్వంలో కూడా త్వరలోనే మరొక సినిమాను స్టార్ట్ చేయనున్నాడు.