అల్లరోడి సినిమా విడుదలైందని ఎంతమందికి తెలుసు..?

Sat Jan 23 2021 22:00:01 GMT+0530 (IST)

How many people know that the movie Allarodi has been released ..?

అల్లరి నరేష్ నటించిన తాజా చిత్రం ‘బంగారు బుల్లోడు’. ఇందులో నరేష్ కి జోడీగా పూజా జవేరి నటించింది. గిరి పల్లిక దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించారు. చాలా గ్యాప్ తర్వాత అల్లరి నరేష్ కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్ లో నటించినట్లు తెలుస్తోంది. ఎప్పుడో పూర్తైన ఈ చిత్రాన్ని ఎట్టకేలకు జనవరి 23న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఈరోజు శనివారం 'బంగారు బుల్లోడు' సినిమా విడుదల అయిందనే విషయం ఎంతమందికి తెలుసు అని ఫిలిం సర్కిల్స్ లో కామెంట్స్ వినిపిస్తున్నాయి.నందమూరి బాలకృష్ణ బ్లాక్ బస్టర్ టైటిల్ 'బంగారు బుల్లోడు'తో పాజిటివ్ బజ్ క్రియేట్ చేసిన చిత్ర యూనిట్.. కరోనా నేపథ్యంలో రిలీజ్ చేయలేకపోయారు. అయితే ఇప్పుడు సాదారణ పరిస్థితులు ఉండటంతో థియేట్రికల్ రిలీజ్ చేశారు. ప్రచార కార్యక్రమాలు చేసినప్పటికీ అల్లరోడి సినిమా రిలీజ్ డేట్ జనాల్లోకి వెళ్లలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కాగా 'బంగారు బుల్లోడు' చిత్రంలో అల్లరి నరేష్ బ్యాంక్ ఉద్యోగిగా నటించాడు. ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతం సమకూర్చగా.. సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ అందించాడు. ఎమ్.ఆర్ వర్మ ఎడిటింగ్ వర్క్ చేశారు. ఈ చిత్రంలో తనికెళ్ళ భరణి - పోసాని కృష్ణ మురళి - ప్రవీణ్ - పృథ్వీ రాజ్ - సత్యం రాజేష్ - వెన్నెల కిశోర్ - ప్రభాస్ శ్రీను - జబర్దస్త్ మహేష్ - భద్రం తదితరులు నటించారు.