పండుగొ స్తే టాలీవుడ్ లో అంతకు మించిన పెద్ద పండగ కనిపిస్తుంది. కొత్త చిత్రాల అప్ డేట్స్ తో స్టార్ హీరోలంతా మరింత జోష్ నింపుతారు. కొత్త ప్రకటనలు...టీజర్..ట్రైలర్..ఫస్ట్ లుక్ అంటూ పెద్ద హడాడుడి కనిపిస్తుంది. మరో రెండు రోజుల్లో తెలుగు సంవత్సరాది ఉగాది వస్తుంది. ఈ నేపథ్యంలో చాలా సినిమా లకు సంబంధించి అప్ డేట్స్ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం మహేష్..పవన్ కళ్యాణ్...రామ్ చరణ్.. ప్రభాస్ సహా చాలా మంది హీరోల సినిమాలు ఆన్స్ సెట్స్ లో ఉన్నాయి. వాటికి సంబంధించి ఏదైనా అప్ డేట్ వచ్చే అవకాశం ఉందని గెస్ చేయోచ్చు.
పవన్ కళ్యాణ్- మేనల్లుడితో కలిసి తమిళ హిట్ సినిమా 'వినోదయ్య సిద్దం' రీమేక్ లో నటిస్తున్నారు. ఈ సినిమా తెలుగు టైటిల్ ఉగాది రోజున ప్రకటించే అవకాశం ఉందని వినిపిస్తుంది. అలాగే పవన్ -హరీష్ శంకర్ కాంబోలో రాబోతుతున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' కి సంబంధించి కొత్త పోస్టర్ రిలీజ్ అవుతుందని ప్రచారం సాగుతుంది.
అలాగే మహేష్ కొన్ని రోజులుగా త్రివిక్రమ్ సినిమా షూట్ లో పాల్గొంటున్నారు. ఆ సినిమా ప్రారంభోత్సం తర్వాత ఎలాంటి అప్ డేట్ రాలేదు. దీంతో ఉగాదికి ఏదొ ఒక స్పెషల్ ట్రీట్ ఉంటుందని అభిమానులు గెస్ చేస్తున్నారు. చరణ్ ఆర్సీ 15 కి సంబంధించి టీజర్ వస్తుందని ప్రచారం సాగుతుంది. అయితే అది ఉగాదికి తెస్తారా? లేక చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఇదే నెల 27 నరిలీజ్ చేస్తారా? అన్నది క్లారిటీ లేదు.
ఇక డార్లింగ్ ప్రభాస్ ఏకంగా మూడు సినిమాలతో రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. 'సలార్'..'ప్రాజెక్ట్ -కె'..'ఆదిపురుష్' అంటూ క్షణం తీరిక లేదు. ఈ సినిమాలకు సంబంధించి ఏదో ఒక అప్ డేట్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఎనర్జిక్ స్టార్ రామ్ పోతినేని పాన్ ఇండియా సినిమా సైలెంట్గా షూటింగ్ చేస్తున్నారు తప్ప ఇంత వరకూ దర్శకుడు బోయపాటి ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఉగాది సంరద్భంగా అభిమానులకు ట్రీట్ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇంకా ఆ రోజున చాలా సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ రివీల్ కానున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.