శోభిత ప్రశ్నలకు చైతూ సమాధానం చెప్పే టైం వచ్చింది..!

Fri Jun 24 2022 13:02:40 GMT+0530 (IST)

How does Nagachaitanya react Questions On Shobhita

నాగ చైతన్య పేరు గత కొన్ని రోజులుగా మీడియాలో మారు మ్రోగిపోతుంది. సమంత నుండి విడిపోయిన సమయంలో చైతూ గురించి మీడియాలో ఏ స్థాయిలో చర్చ జరిగిందో ఇప్పుడు అదే స్థాయి లో చర్చ మళ్లీ జరుగుతోంది. అయితే ఈసారి చైతూ నిజంగానే హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల ప్రేమలో ఉన్నాడా అన్న యాంగిల్ లో చర్చ జరుగుతూ ఉంది. సినీ జనాల్లో మరియు ప్రేక్షకుల్లో చాలా ప్రశ్నలు ఉన్నాయి.శోభిత గురించి అక్కినేని ఫ్యాన్స్ నుండి మొదలుకుని జర్నలిస్ట్ ల వరకు నాగ చైతన్య ను అడగాలని కొన్ని ప్రశ్నలు రెడీ చేసుకుని వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు చైతూ దొరకుతాడా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. లవ్ స్టోరీ సినిమా సమయంలోనే రకరకాలుగా పుకార్లు వచ్చాయి. ఆ సమయంలో మీడియా ముందుకు నాగ చైతన్య వచ్చాడు కాని క్లారిటీ లేకుండా సమాధానాలు ఇచ్చాడు.

ఇప్పుడు థాంక్యూ సినిమా తో వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు నాగ చైతన్య రెడీ అవుతున్నాడు. సినిమా ప్రమోషన్ కోసం చైతూ వచ్చే వారం నుండే మీడియా ముందుకు రాబోతున్నాడు. రెండు వారాల పాటు మీడియాతో మమేకం కాబోతున్న నాగ చైతన్య ముందు శోభిత అనే పేరుతో పదుల కొద్దీ ప్రశ్నలు వెల్లువెత్తే అవకాశాలు ఉన్నాయి.

ఆయన ప్రతి ఇంటర్వ్యూలో కూడా ఆయనకు ఇష్టం లేకున్నా కూడా శోభిత గురించి ప్రస్తావించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అందులో నాగచైతన్య ఎలా రియాక్ట్ అవుతాడు.. అసలు శోభిత తో తనుకు ఉన్న రిలేషన్ గురించి ఆయన ఏమని చెప్తాడు అంటూ ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నేపథ్యంలో శోభిత తో ప్రేమలో ఉన్నది లేదిని చైతూ నుండి థాంక్యూ మూవీ ప్రమోషన్స్ సందర్బంగా క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అక్కినేని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు.

నాగ చైతన్య గత కొన్ని రోజులుగా హీరోయిన్ శోభిత దూళిపాళ్లతో రిలేషన్ లో ఉన్నాడని.. ఆమె బర్త్ డే పార్టీ కి హాజరు అవ్వడంతో పాటు ముంబయి లో ఇద్దరు కొన్నాళ్లుగా సహజీవనం సాగించారని కూడా అంటున్నారు. మొత్తానికి నాగ చైతన్య మరియు శోభిత ల ఇష్యూ కాస్త సీరియస్ గానే ఉంది. ఈ సమయంలో నాగ చైతన్య థాంక్యూ ప్రెస్ మీట్ లో ఏం చెప్పబోతున్నాడు అనేది ఆసక్తికరంగా మారింది.

ఇక  థాంక్యూ సినిమా విషయానికి వస్తే మనం దర్శకుడు విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో రూపొందింది. భారీ అంచనాల నడుమ దిల్ రాజు ఈ సినిమాను నిర్మించాడు. రాశి ఖన్నా.. మాళవిక నాయర్ మరియు అవిక గోర్ లు ఈ సినిమా లో హీరోయిన్స్ గా నటించారు. చైతూ మూడు జనరేషన్స్ లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే అందుకు సంబంధించిన లుక్స్ సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు చేరువ అయ్యాయి. థాంక్యూ సినిమా పై ఫ్యాన్స్ లో ఆసక్తి భారీగా ఉంది. మరి సినిమా ఎలా ఉంటుంది అనేది జూలై 8న రిలీజ్ అయితే క్లారిటీ రానుంది.