పుట్టిన ఊరిని స్వదేశాన్ని మిస్సయితే ఎలా నోరా?

Sat Jan 15 2022 06:00:01 GMT+0530 (IST)

How can Nora miss her hometown?

బాలీవుడ్ ఐటం గాళ్ నోరా పతేహీ కెరీర్ జర్నీ ఇన్ స్టా సెన్షేషన్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎప్పటికప్పుడు కొత్త ఫోటోషూట్లు వీడియో షూట్లతో హీటెక్కించడం అమ్మడి ప్రత్యేకతే. ఇక విదేశీ వెకేషన్స్ లో ఏ రేంజ్ లో అందాల వడ్డన చేస్తుందో తెలిసిందే. ఖాళీ సమయం దొరికితే విహార యాత్రలు వెళ్లడం. అమ్మడి హాబీ.. తాజాగా  ట్రావెల్- లీజర్ ఇండియాకి ఇచ్చిన మ్యాగజైన్ ఇంటర్వ్యూలో  ట్రావెల్ బగ్ గురించి ఇలా చెప్పుకొచ్చింది. మాల్దీవులు..టర్కీ..ఇటలీ..క్యూబా మరికొన్ని ప్రదేశాల్ని నా జాబితాలో చేర్చుకున్నాను. ఇక్కడికి తరుచూ  వెళ్తుంటాను కాబట్టి..వాటిని దాదాపు కవర్ చేసేసాను.ఈ జాబితాలో మొరాకోను కూడా చేర్చుకోవాలి. మొరాకో అంతటా పర్యటించాలి. అనేక అందమైన బీచ్ లు.. నగరాల్ని చుట్టేయాలి. ఎప్పటి నుంచో ఇలా అనుకుంటున్నాను. కానీ వీలు పడటం లేదు.  మంచి సమయం చూసుకుని మొరాకో చెక్కేయాలని నోరా తెలిపింది. ఇక మొరాకో అమ్మడి సొంత దేశం.  అక్కడే పుట్టింది. కానీ కెనడా బహుళ -సాంస్కృతిక పరిసరాల్లో ఎక్కువ సంవత్సరాలు గడిపింది. యుక్త వయసులోనే సౌదీ అరేబియాలో రెండు సంవత్సరాలు గడిపింది. అక్కడ నుంచి వివిధ దేశాలు తిరిగింది. మొత్తానికి మొరాకో లో పుట్టి న ఈ బ్యూటీ మొరాకోని మిస్సవ్వడం ఆశ్చర్యకరమే.

ఇక ఈ బ్యూటీ బాలీవుడ్ లో `దిల్బర్`..`నాచ్ మేరీ రాణి`..`ఓ సాకి సాకి` ..`గార్మి` వంటి హిట్ ట్రాక్ లతో ఓ ఊపు ఊపేసిన సంగతి తెలిసిందే. ఆ సక్సెస్ లతోనే బాలీవుడ్ ఐటం గాళ్స్ జాబితాలో స్థానం సంపాదించింది. ఈ బ్యూటీ చివరి సారిగా గురు రంధవాతో కలిసి `డ్యాన్స్ మేరి రాణీ` మ్యూజిక్ వీడియోలో కనిపిచింది. తెలుగులో `బాహుబలి ది బిగినింగ్` లో ఐటం గాళ్ గా మెప్పించిన సంగతి తెలిసిందే. అంతకు ముందు `టెంపర్` చిత్రంలో స్పెషల్ సాంగ్ లో నటించింది.