వీడియో: హబ్బీ బర్త్ డేకి పీసీ ట్రీట్ ఇలా

Tue Sep 17 2019 13:54:04 GMT+0530 (IST)

How Priyanka Chopra Wished Nick On Birthday

ప్రపంచంలో ఏ భర్తకు దక్కని భాగ్యం అమెరికన్ బోయ్ నిక్ జోనాస్ కి దక్కిందనేందుకు ఇంతకంటే సాక్ష్యం ఇంకేం కావాలి. ఇండియన్ బ్యూటీ ప్రియాంక చోప్రాని పెళ్లాడిన తర్వాత ప్రతి క్షణం నిక్ జీవితంలో ఆనందం వెల్లివిరుస్తోంది. అతడి ప్రతి మూవ్ మెంట్ ఓ సెలబ్రేషన్ లా మారింది. ప్రతి సెలబ్రేషన్ ని పీసీ సోషల్ మీడియా వేదికగా రివీల్ చేస్తూనే ఉంది. భర్త నిక్ జోనాస్ తో ప్రతి గ్రేట్ మూవ్ మెంట్ ని కెమెరాల సాక్షిగా క్యాప్చుర్ చేస్తూ అభిమానులకు చేరవేస్తూనే ఉంది పీసీ. తమపై ప్రముఖ అమెరికన్ మ్యాగజైన్ నెగెటివ్ కథనాలు రాస్తూ కంపరం పుట్టించినా .. కాపురంలో నిప్పు పెట్టాలని చూసినా అన్నిటినీ తట్టుకుని నిలబడగలిగింది. ఫ్యామిలీ లైఫ్ ని అందంగా మలుచుకుంటోంది.తన లైఫ్ లో ప్రతి సెలబ్రేషన్ ని ప్రతి మూవ్ మెంట్ ని క్యాప్చుర్ చేసి ఆ వీడియోల్ని లైబ్రరీలో దాచుకుంది. వాటి నుంచి ఒక మిక్స్ డ్ వీడియోని రూపొందించి నేడు భర్త నిక్ జోనాస్ బర్త్ డే సందర్భంగా తనకు ఆ వీడియోని కానుకగా అందించింది పీసీ. వ్వాహ్.. ఈ ఐడియానే గ్రేట్ అనిపించింది. ప‌్రపంచంలో ఏ భర్తకు దక్కని అరుదైన కానుక ఇదేనని నిస్సందేహంగా చెప్పొచ్చు.

16 సెప్టెంబర్ నిక్ బర్త్ డే సందర్భంగా పీసీ ఈ వీడియోని షేర్ చేసింది. జోనాస్ బ్రదర్స్ పాప్ ప్రపంచంలోకి రీఎంట్రీ ఇచ్చిన సంవత్సరం ఇది. ఆ సందర్భంలో అభిమానులతో గ్రేట్ మూవ్ మెంట్ ని ఈ వీడియోలో ప్రదర్శించి బ్రదర్స్ మనసును దోచుకుంది పీసీ. 15వ తేదీ మిడ్ నైట్ 12 దాటాక ఆకాశమే హద్దుగా పీసీ పార్టీని సెలబ్రేట్ చేసిందట. ఇంత గొప్ప ప్రేమను పంచే భర్త తన సొంతం అయినందుకు థాంక్స్ చెప్పింది పీసీ. ఐ లవ్ యు నిక్.. ఇదే నీకు నా కానుక! అంటూ ఆ అరుదైన వీడియోని భర్త నిక్ జోనాస్ కి పీసీ షేర్ చేసింది.

పీసీ నటించిన బాలీవుడ్ చిత్రం `ది స్కై ఈజ్ పింక్` ఇటీవలే రిలీజై క్రిటిక్స్ ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రంలో పీసీ నటనకు అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. ఈ మూవీలో పీసీ అద్భుతమైన ఎమోషనల్ పెర్ఫామెన్స్ తో కట్టి పడేసిందని ముంబై క్రిటిక్స్ ప్రశంసించడం నిక్ చెవిన పడిందట. ఆ ఇద్దరికీ ఇవి గ్రేట్ మూవ్ మెంట్స్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.

    
వీడియో కోసం క్లిక్ చేయండి