సాహో ఎంత వసూలు చేస్తే సేఫ్?

Sun Aug 25 2019 07:00:01 GMT+0530 (IST)

How Much Collection Need Saaho To Go In Safe Zone

సౌత్ నుంచి అసాధారణ క్రేజుతో రిలీజైన  2.0 (రజనీ- శంకర్) తర్వాత మళ్లీ అంతే క్రేజీగా రిలీజవుతున్న ఏకైక సినిమా `సాహో`. 2.0 చిత్రం దాదాపు 450-500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి అంతే పెద్ద స్థాయిలో ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది. అయితే  కొన్ని చోట్ల భారీ బెట్టింగ్ నడిచిన చోట నష్టాలు వచ్చినా ఉత్తరాదిన చక్కని వసూళ్లు సాధించి ఊపిరి పీల్చుకోగలిగేలా చేసింది. అయితే ఇప్పుడు సాహో సన్నివేశం ఎలా ఉండబోతోంది? అంటూ ట్రేడ్ అంచనాలు వేస్తోంది.ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారం.. దాదాపు 300-350 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన `సాహో` వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ 320 కోట్లకు అమ్మారు.. ఆ రేంజు షేర్ వసూలవ్వాలన్నది ఓ విశ్లేషణ. నాన్ థియేట్రికల్ కలుపుకుని బిజినెస్ రేంజ్ 450-500 కోట్ల మేర సాగుతోందని చెబుతున్నారు. ఇక తొలి రోజు.. తొలి వీకెండ్ నాటికే సాహో చిత్రం భారీగా పెట్టిన పెట్టుబడుల్ని తిరిగి రాబట్టాల్సి ఉంటుంది. 2.0 తరహాలో ఆరంభం నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అయినా అంత పెద్ద మొత్తాల్ని రికవరీ చేయడం సులువేం కాదు. అలా కాకుండా హిట్టు అన్న టాక్ తెచ్చుకుంటే మాత్రం ఈ సినిమా తిరిగి బాహుబలి ఫీట్ ని రిపీట్ చేస్తుందని ఓ వర్గం అంచనా వేస్తోంది.

అయితే సాహో ఆ స్థాయి వసూళ్లతో సంచలనం సృష్టిస్తుందా?  బాహుబలి సీన్ రిపీటవుతుందా? అంటూ అటు మేకర్స్ లోనే కాదు.. ఫ్యాన్స్ గుండెల్లో లబ్ డబ్ వినిపిస్తోంది. అన్నిటికీ ఆగస్టు 30 సమాధానం చెబుతుందేమో! ఒక రోజు ముందే అంటే ఆగస్టు 29న ప్రపంచవ్యాప్తంగా భారీగా సాహో ప్రీమియర్లు వేయనున్నారు. ఇరు తెలుగు రాష్ట్రాల్లో టిక్కెట్టు రేటును పెంచుకునే వెసులుబాటు కలగనుందని తెలుస్తోంది.