Begin typing your search above and press return to search.
బాలయ్య సినిమా తర్వాత కాజల్ కెరీర్ ఎలా ఉండబోతుందో..!
By: Tupaki Desk | 6 Feb 2023 9:00 AMటాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ దశాబ్ద కాలంకు పైగా స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది. కెరీర్ కాస్త డల్ అయిన సమయంలో కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకుని తల్లి కూడా అయ్యింది. సౌత్ హీరోయిన్స్ పెళ్లి అయ్యి తల్లిగా మారిన తర్వాత ఆఫర్లు రావడం చాలా తక్కువగా జరుగుతుంది. బాలీవుడ్ లో మాదిరిగా అమ్మలకు హీరోయిన్ పాత్రలు ఇవ్వడం చాలా తక్కువ.
కాజల్ అగర్వాల్ తల్లి అయిన తర్వాత బాలకృష్ణ సినిమా తో రీ ఎంట్రీ ఇవ్వబోతుంది. అనీల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో బాలయ్య కు జోడీగా కాజల్ అగర్వాల్ కన్ఫర్మ్ అయ్యిందని విశ్వసనీయంగా సమాచారం అందుతోంది. అధికారిక ప్రకటన అతి త్వరలోనే వచ్చే అవకాశాలు ఉన్నాయి.
బాలకృష్ణ గత చిత్రాలను పరిశీలిస్తే హీరోయిన్స్ పాత్రలకు ఎక్కువ ప్రాముఖ్యత ఉండటం లేదు. అఖండ అంత భారీ విజయాన్ని సొంతం చేసుకున్నా కూడా ప్రగ్యా జైస్వాల్ యొక్క కెరీర్ కి పెద్దగా ప్లస్ అయ్యిందే లేదు.
ఇక వీర సింహారెడ్డి సినిమాతో శృతి హాసన్ కు మంచి హైప్ వచ్చింది కూడా లేదు.. కనుక బాలయ్య సినిమాలో నటించిన తర్వాత కాజల్ అగర్వాల్ పరిస్థితి ఏంటీ అనేది ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.
కాజల్ అగర్వాల్ గతంలో మాదిరిగా తన అందాల ఆరబోత ఫొటో షూట్స్ తో మళ్లీ సోషల్ మీడియాలో హడావుడి చేస్తోంది. కాజల్ అందం పెళ్లికి ముందు కంటే ఏమాత్రం తగ్గలేదు. ఇప్పుడు ఇంకాస్త కొత్తగా అందంగా కనిపిస్తుందని అభిమానులు అంటున్నారు.
కనుక బాలయ్య సినిమా లో మినిమం రోల్ లభించినా కూడా ముందు ముందు మరిన్ని సినిమాల్లో ఈ అమ్మడికి ఆఫర్లు దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య సినిమా ఫలితం పై కాజల్ భవిష్యత్తు కెరీర్ ఆధారపడి ఉందని కూడా కొందరు అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.