Begin typing your search above and press return to search.

చిట్టీ సినీ కెరీర్ ఎలా న‌డుస్తుందో..?

By:  Tupaki Desk   |   16 Jun 2021 2:30 PM GMT
చిట్టీ సినీ కెరీర్ ఎలా న‌డుస్తుందో..?
X
'నక్షత్ర' అనే వెబ్‌ సిరీస్‌ లో నటించిన హైదరాబాద్‌ అమ్మాయైన ఫరియా అబ్దుల్లా.. డైరెక్టర్ నాగ్ అశ్విన్ దృష్టిలో పడి సినిమా ఛాన్స్ కొట్టేసింది. 'జాతిరత్నాలు' సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా అడుగుపెట్టిందీ పొడుగుకాళ్ళ సుందరి. 'చిట్టి' పాత్రలో మెప్పించిన ఈ టవర్ బ్యూటీ.. ఫస్ట్ సినిమాతోనే మంచి క్రేజ్ అందుకుంది. ఈ క్రమంలో అమ్మడికి మంచి క్రేజీ ఆఫ‌ర్లు వ‌స్తాయ‌ని అంతా అనుకున్నారు. అయితే ఎందుక‌నో ఈ బ్యూటీని ఎవ‌రూ పెద్దగా ప‌ట్టించుకోవడం లేదని ఫిలిం సర్కిల్స్ లో డిస్కషన్ జరుగుతోంది.

తొలి సినిమాతో కుర్రకారుని తనవైపు తిప్పుకున్న ఫారియా అబ్దుల్లా.. ఇప్పుడు వ‌చ్చిన అవ‌కాశాన్నే స‌ద్వినియోగం చేసుకోవ‌డానికి ట్రై చేస్తోంది. లేటెస్టుగా ఈ బ్యూటీ అగ్ర దర్శకుడు డైరెక్ట్ చేయబోయే ఓ సినిమాకి సైన్ చేసిందని తెలుస్తోంది. అయితే ఇక్క‌డే ఫరియా కెరీర్ కి అస‌లు చిక్కొచ్చి ప‌డ‌నుందని కామెంట్స్ వస్తున్నాయి. దీనికి కారణం ఆమె కమిటైన సినిమా టాలీవుడ్ లో ఓ పెద్ద ఫ్యామిలీకి చెందిన హీరోతో కావడమేనని అంటున్నారు.

సదరు ఫ్యామిలీ హీరోల‌తో సినిమాలు చేసిన హీరోయిన్ల‌కి ఆ త‌రువాత పెద్ద‌గా సినిమాలు రావనే యాంటీ సెంటిమెంట్ ఇండ‌స్ట్రీలో బాగా న‌డుస్తోంది. సినిమా హిట్ ప్లాప్ అనేది పక్కన పెడితే.. ఆ హీరోయిన్లు తదుపరి ఆఫర్ కోసం చాన్నాళ్లు ఎదురు చూడాల్సిందేనని అంటుంటారు. ఇప్పుడు అలాంటి ఫ్యామిలీ హీరోతో ఫరియా సినిమా చేస్తోంది. మరి దీంతో హైట్ బ్యూటీ కెరీర్ ఎలా న‌డుస్తుందో అనే ప్ర‌శ్న‌లు ఇప్పుడు సినీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.