క్రిష్ షో రన్నర్ గా హాట్ స్టార్ `9 అవర్స్`

Thu May 12 2022 21:00:01 GMT+0530 (IST)

Hotstar Specials 9Hours On June 2nd

ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ ని అందించడంలో ముందుంటుంది ప్రముఖ ఓటీటీ దిగ్గజం డిస్నీ ప్లస్ హాట్ స్టార్. సినీ వెబ్ ప్రియుల కోసం సరికొత్త సినిమాలని విభిన్నమైన సిరీస్ లని అందిస్తూ ఎంటర్ టైన్ చేస్తోంది. ఇన్నోవేటీవ్ థాట్స్ తో ముందుకొచ్చే కథలని ప్రోత్సహిస్తూ సరికొత్త సిరీస్ లని వీక్షకులకు అందిస్తోంది. ఈ క్రమంలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మరో కొత్త వెబ్ సిరీస్ ని అందించబోతోంది. ఇంట్రెస్టింగ్ స్టోరీతో సాగే ఓ వెబ్ సిరీస్ ని త్వరలో ఓటీటీ ప్రియుల కోసం అందించబోతోంది.`9 అవర్స్` పేరుతో రూపొందిన ఈ వెబ్ సిరీస్ కు షో రన్నర్ గా స్టార్ డైరెక్టర్ క్రిష్ వ్యవహరించడం విశేషం.   గతంలో ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ కోసం తొలి సారి వెబ్ సిరీస్ చేసిన క్రిష్ మళ్లీ ఇన్నాళ్లకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కోసం రూపొందిన `9 అవర్స్` వెబ్ సిరీస్ కు షో రన్నర్ గా వ్యవహరించడంతో ఈ సిరీస్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సిరీస్ లో తారకరత్న అజయ్ వినోద్ కుమార్ మధు షాలిని రవివర్మ ప్రీతీ ఆస్రానీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వై. రాజీవ్ రెడ్డి సాయిబాబు జాగర్లమూడి సంయుక్తంగా ఈ వెబ్ సిరీస్ ని నిర్మించారు. జూన్ 2 నుంచి స్ట్రీమింగ్ కానుంది. నిరంజన్ కౌషిక్ జాకబ్ వర్గీస్ దర్శకత్వం వహించారు. పీరియాడిక్ క్రైమ్ డ్రామాగా డెక్కన్ ఇంపీరియల్ బ్యాంక్ రాబరీ నేపథ్యంలో రూపొందించారు.  ముగ్గురు ఖైదీలు ఓ భారీ దొంగతనానికి ప్లాన్ చేస్తారు.

జైలు నుంచి తప్పించుకున్న వాళ్లు డెక్కన్ ఇంపీరియల్ బ్యాంక్ రాబరీకి వెళతారు. అక్కడ వాళ్లు అనుకున్న ప్లాన్ వర్కవుట్ అయిందా? .. ఇది తెలిసి పోలీసులు తీసుకున్న చర్చలేంటీ? అన్నదే ఇందులో ఆసక్తికరం.