Begin typing your search above and press return to search.

ఆ యువ ద‌ర్శ‌కుడంటే హాట్ బ్యూటీ కి అంతిష్ట‌మా?

By:  Tupaki Desk   |   29 May 2023 12:17 PM GMT
ఆ యువ ద‌ర్శ‌కుడంటే హాట్ బ్యూటీ కి అంతిష్ట‌మా?
X
టాలీవుడ్ లో అత‌నో యువ ద‌ర్శ‌కుడు. చేసినవి రెండు..మూడు సినిమాలే. కానీ ఇన్నోవేటివ్ ద‌ర్శ‌కుడిగా మంచి పేరు సంపాదించుకున్నాడు. స్టార్ హీరోల దృష్టిలోనూ ప‌డ్డాడు. బ‌డా బ్యాన‌ర్ల‌లో అవ‌కాశాలు అందుకుం టున్నాడు. త్వ‌ర‌లో ఆయ‌న తెర‌కెక్కించిన ఓ సినిమా కూడా రిలీజ్ అవుతుంది. ఈ నేప‌థ్యంలో యంగ్ డైరెక్ట‌ర్ ని ఓ హాట్ హీరోయిన్ ఇష్ట‌ప‌డుతుంది! అన్న సంగ‌తి ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

అవును ఈ డైరెక్ట‌ర్ ని ఓ సీనియ‌ర్ భామ ఇష్ట‌ప‌డుతుందిట‌. అది ఇప్ప‌టి నుంచి కాదు. అత‌గాడి ద‌ర్శ‌క‌త్వం లో న‌టించిన తొలి సినిమాతోనే ఇష్టం పెంచుకుందిట‌. తొలుత స్నేహంగానే మొద‌లైందిట‌.

ఆ త‌ర్వాత అది ప్రేమ‌గా చిగురించిందిట‌. ఎప్పుడైనా ఆ యంగ్ మేక‌ర్ గురించి అడిగితే టైమ్ తెలియ‌కుండా మాట్లాడుతుందిట‌. అత‌గాడి ప‌నిత‌నం గురించి గొప్ప‌లు వీర‌లెవ‌ల్లో చెబుతుందిట‌.

అత‌న్ని అంత‌గా ఇష్ట‌ప‌డ‌టం వెనుక అత‌డి ప్ర‌తిభ ఓ కార‌ణం అంటున్నారు. ఇన్నోవేటివ్ గా ఆలోచించ‌డం.. నిజ జీవితంలో కూడా అంతే వాస్త‌వికంగా ఉండ‌టం వంటివి ఆ హీరోయిన్ బాగా న‌చ్చి ఇష్ట‌ప‌డ‌టం మొద‌లు పెట్టిందిట‌. ఆ ఇష్టం మొద‌లై ఐదేళ్లు అయినా ఇప్ప‌టికీ ఆ ఇష్టం అంతే ప‌దిలంగా ఉందిట‌. ట్విస్ట్ ఏంటంటే? ఈ విష‌యం ఆ ద‌ర్శ‌కుడికి ఇంకా తెలియ‌ద‌ట‌.

ఆవిడ ప్రియుడిగా ఫీల‌వుతున్నా? త‌నని ఇంకా అత‌ను స్నేహితురాలిగానే భావిస్తున్నాడుట‌. మ‌రి విష‌యం తెలియ‌క అలా ఉన్నాడా? లేక తెలిసి న‌టిస్తున్నాడా? అన్న‌ది మ‌రో సందేహంగానూ క‌నిపిస్తుంది.

అయితే ఆ ద‌ర్శ‌కుడు ఆమెక‌న్నా ఏడాది చిన్న‌వాడు. తొలుత వయ‌సు వ్య‌త్యాసం భారీగా ఉంటుంద‌ని అనుకున్నా! స‌న్నిహిత వ‌ర్గాల ద్వారా ఆవిష‌యంలో పెద్ద స‌మ‌స్యేం లేద‌ని కాక‌పోతే ఈ ప్రేమాయ‌ణం ఒన్ సైడా? రెండు వైపులా అన్న‌ది? వాళ్లు కూడా స‌రైన క్లారిటీ ఇవ్వ‌లేక‌పోతున్నారు.

ఇంత‌కీ ఎవ‌రా ద‌ర్శ‌కుడు? ఎవ‌రా హీరోయిన్ అన్న‌ది అతి త్వ‌ర‌లో రివీల్ అవుతుంది.