Begin typing your search above and press return to search.
RRR కోసం హాలీవుడ్ స్టార్ ఎక్కడైనా సైన్ పెడతానంటోంది
By: Tupaki Desk | 31 Jan 2023 10:50 AMగత ఆరు నెలలుగా ఆర్ఆర్ఆర్ సినిమా గురించి లోకల్ నుండి ఇంటర్నేషనల్ మీడియా వరకు చర్చ జరుగుతూనే ఉంది. ఇటీవల గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకోవడంతో పాటు ఏకంగా ఆస్కార్ అవార్డ్ కు నాటు నాటు సాంగ్ నామినేట్ అవ్వడంతో ప్రపంచ వ్యాప్తంగా ఆర్ ఆర్ ఆర్ పేరు మరింతగా మారు మ్రోగుతోంది అనడంలో సందేహం లేదు.
కేవలం హాలీవుడ్ మీడియా వారు మరియు హాలీవుడ్ ప్రేక్షకులు మాత్రమే ఈ సినిమా గురించి మాట్లాడటం లేదు. ఏకంగా హాలీవుడ్ స్టార్స్ పలు సందర్భాల్లో ఆర్ఆర్ఆర్ సినిమా గురించి.. సినిమాలోని టెక్నికల్ విషయాల గురించి మాట్లాడటం మనం చూస్తూనే ఉన్నాం. పదే పదే హాలీవుడ్ స్టార్స్ సోషల్ మీడియా పేజీల్లో మన ఆర్ఆర్ఆర్ సినిమా ఘన కీర్తిని చూస్తూనే ఉన్నాం.
తాజాగా హాలీవుడ్ బ్లాక్ బస్టర్ టామ్ క్రూజ్ మూవీ టాప్ గన్ : మావెరిక్ లో నటించిన హీరోయిన్ మోనికా బార్బరో ఇన్ స్టా లో ఆర్ఆర్‌ఆర్ సినిమాలోని ఎత్తర జెండా పాట హిందీ వర్షన్ ను తన స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తున్న వీడియోను షేర్ చేసింది. ఆ పాటకు రచ్చ రచ్చ గా డాన్స్ చేస్తూ బార్బరో వీడియో షేర్ చేయడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఆర్ఆర్ఆర్ సినిమా యొక్క తెలుగు వర్షన్ ను నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేయాలని డిమాండ్ చేసింది. తెలుగు లో స్ట్రీమింగ్ చేయడానికి తాను ఏ పిటీషన్ పై అయినా సంతకం చేసేందుకు రెడీ అన్నట్లుగా మోనికా బార్బరో సరదాగా ఇన్ స్టా గ్రామ్ ద్వారా తన విజ్ఞప్తిని యూనిట్ సభ్యులకు మరియు నెట్ ఫ్లిక్స్ వారికి తెలియజేసింది.
ఇలా ఎంతో మంది హాలీవుడ్ స్టార్స్ ఆర్ఆర్‌ఆర్ సినిమా యొక్క పాటలను మరియు యాక్షన్ సన్నివేశాలను ఆస్వాదిస్తూనే ఉన్నారు. తాజాగా ఈ అమ్మడు తెగ డాన్స్ చేస్తూ ఎత్తర జెండా పాటను ఆస్వాదిస్తున్న వీడియో వైరల్ అవుతోంది. ఆర్ఆర్‌ఆర్ సినిమా ను నెట్ ఫ్లిక్స్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

TOP GUN maverick fame actress Monica barbaro #RRRMovie pic.twitter.com/kMmrlztEd5
— Rick Sulgie (@Aloydinkan) January 30, 2023