Begin typing your search above and press return to search.

జురాసిక్ పార్క్ నటుడికి బ్లడ్ క్యాన్సర్..!

By:  Tupaki Desk   |   19 March 2023 5:17 PM GMT
జురాసిక్ పార్క్ నటుడికి బ్లడ్ క్యాన్సర్..!
X
ప్రముఖ హాలీవుడ్ నటుడు సామ్ నీల్ బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నారు. ప్రస్తుతం క్యాన్సర్ థర్డ్ స్టేజ్ లో ఉందని దానికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నానని చెప్పారు. అయితే తాను ఎన్నో రోజులు బ్రతకనని అందుకే తన జీవితం గురించి ఒక బుక్ రాయాలని అనుకున్నా.. ఆల్రెడీ రాయడం మొదలు పెట్టానని అన్నారు సామ్ నీల్. సాం నీల్ అనగానే అందరికి జురాసిక్ పార్క్ గుర్తుకొస్తుంది. అందులో నటించి వరల్డ్ సినీ లవర్స్ ని అలరించిన సామ్ నీల్ ఆ తర్వాత ఎన్నో హాలీవుడ్ సినిమాల్లో నటించారు. అయితే సామ్ నీల్ అనగానే అందరు ఆయన చేసిన ఎన్నో సినిమాలను కాకుండా జురాసిక్ పార్క్ నటుడనే అంటారు.

క్యాన్సర్ తో పోరాడుతున్న ఆయన ఫ్రెండ్స్, రిలేటివ్స్ తో టైం స్పెండ్ చేయాలని ఉన్నా అలా చేయలేకపోతున్నానని బాధపడుతున్నారు సామ్ నీల్. 1977 లో వచ్చిన స్పీపింగ్ డాగ్స్ అనే సినిమాతో తెరంగేట్రం చేసిన సామ్ నీల్ 1993లో వచ్చిన జురాసిక్ పార్ లో గ్రాంట్ రోల్ లో నటించి మెప్పించారు. ఏ సినిమా చేసినా ఏ పాత్ర చేసినా అందులో తనదైన శైలిలో నటన కనబరిచిన సామ్ నీల్ కు క్యాన్సర్ అని తెలియగానే ఆయన ఫ్యాన్స్ షాక్ అయ్యారు.

క్యాన్సర్ థర్డ్ స్టేజ్ లో ఉండటం వల్ల సామ్ నీల్ తగిన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అయితే ఈ టైం లో బుక్ రాయాలని అనుకోవడం పెద్ద సాహసమే కానీ తన గురించి ప్రపంచానికి తెలియచేసేలా బుక్ రాయాలని అనుకున్నారు సామ్ నీల్. అందుకే ఈ టైం లో రిస్క్ అనిపించినా సరే బుక్ రాసేందుకు సిద్ధమయ్యారు. సామ్ నీల్ కు బ్లడ్ క్యాన్సర్ అని తెలియగానే సినీ ప్రియులంతా కూడా ఆయన కోలుకోవాలని ప్రార్ధనలు చేస్తున్నారు.

ఎన్నో హాలీవుడ్ సినిమాల్లో నటించి తన ముద్ర వేసిన సామ్ నీల్ క్యాన్సర్ ని జయించి మళ్లీ సినిమాల్లో నటించాలని హాలీవుడ్ సినీ ప్రియులు కోరుతున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.