కనిపించకుండా పోయిన హీరోయిన్ శవం లభ్యం

Tue Jul 14 2020 14:00:57 GMT+0530 (IST)

The body of the missing heroine is found

ఫాక్స్ మ్యూజికల్ కామెడీ చిత్రం ‘గ్లీ’ లో కీలక పాత్రలో నటించిన ప్రముఖ నటి నయా రివీరా కొన్ని రోజుల క్రితం కాలిఫోర్నియాలోని పెరూ లేక్‌లో ఒక బోట్ అద్దెకు తీసుకుని కొడుకుతో షికారుకు వెళ్లింది. రివీరా సాయంత్రం అయినా కూడా బోట్ తో రాకపోవడంతో బోట్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దాంతో పాటు రివీరా కుటుంబ సభ్యులకు తెలియజేశారు. పోలీసులు రంగంలోకి దిగి బోట్‌ను కనిపెట్టారు. అయితే బోట్‌లో పిల్లాడు ఒంటరిగా నిద్రిస్తూ ఉన్నాడు. పిల్లాడి పక్కన లైఫ్ జాకెట్ మాత్రమే ఉంది. రివీరా లేకపోవడంతో ఆమె లేక్‌లో పడిపోయి ఉంటుందని అనుమానించారు.పెరూ లేక్ మొత్తంను దాదాపుగా అయిదు రోజులు జల్లెడ పట్టగా పోలీసులకు ఎట్టకేలకు మిస్ అయిన రివీరా శవం అయ్యి కనిపించింది. రివీరా తనయుడు అమ్మ నేను స్విమ్మింగ్‌కు వెళ్లాం. ఇద్దరం కూడా స్విమ్ చేశాం. ఆ తర్వాత నేను బోట్ వద్దకు వచ్చాను అమ్మ మాత్రం రాలేదు అంటూ బంధువులకు చెప్పాడు. దాంతో ఆమె ఆత్మహత్య చేసుకుని ఉంటుందని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసిన కాలిఫోర్నియా పోలీసులు ప్రస్తుతం ఎంక్వౌరీ చేస్తున్నారు.

గ్లీ చిత్రంలో నటించిన నటీనటులు వరుసగా మృతి చెందడం సినీ వర్గాల వారిని ఆశ్చర్యంకు గురి చేస్తోంది. చాలా కాలం క్రితమే రివీరా సహ నటుడు అయిన కోరి మాంటెయిత్ మృతి చెందిన విషయం తెల్సిందే. కొన్ని రోజుల క్రితం ఆ సినిమాలో కీలక పాత్రలో నటించిన మార్క్ సాలింగ్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు ఆ సినిమా నటి అయిన రివీరా కూడా మృతి చెందడం ఆశ్చర్యంగా ఉందంటున్నారు.