Begin typing your search above and press return to search.

మరో మలయాళం రీమేక్ లో నటించనున్న 'ఫలక్ నుమా దాస్'

By:  Tupaki Desk   |   10 July 2020 3:45 AM GMT
మరో మలయాళం రీమేక్ లో నటించనున్న ఫలక్ నుమా దాస్
X
టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోల హవా ఈ మధ్య మాములుగా లేదు. అందులో విశ్వక్ సేన్ కూడా ఒకరు. ఈ నగరానికి ఏమైంది సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆ తర్వాత సొంతంగా డైరెక్షన్ చేసి 'ఫలక్ నుమా దాస్' సినిమాను రూపొందించాడు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అయి విశ్వక్ కి యూత్ లో విపరీతమైన క్రేజ్ తీసుకొచ్చింది. పక్కా హైదరాబాద్ యాసలో తీసిన ఫలక్ నుమా దాస్ సినిమాతో తనని తను నిరూపించుకున్న విశ్వక్ కి కొత్త సినిమాల ఆఫర్లు క్యూ కట్టాయి. "నన్నెవడు లేపే అవసరం లేదు.. నన్ను నేను లేపుకుంటా" అనే సంచలనమైన వ్యాఖ్యలతో యూత్ ని తనవైపు తిప్పుకున్న విశ్వక్. రీసెంట్ గా కొత్త డైరెక్టర్ శైలేంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన 'హిట్' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఆ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ కొట్టడంతో విశ్వక్ తదుపరి సినిమా ఏంటా.. అని అభిమానులలో చర్చలు మొదలయ్యాయి.

అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ యంగ్ హీరో మరో మలయాళం సినిమా పై కన్నేసినట్లు తెలుస్తుంది. ఇదివరకే విశ్వక్.. మలయాళం నుండి అంగమలై డైరీస్ మూవీని ఫలక్నుమా దాస్ పేరుతో రీమేక్ చేసాడు. ఆ సినిమాకి దర్శకనిర్మాత రెండు ఇతనే. ఇక ఇప్పుడు కప్పెలా అనే థ్రిల్లింగ్ లవ్ స్టోరీ మూవీ ఓకే చేసాడట. ఈ సినిమా లాక్ డౌన్ ముందే విడుదలై మంచి విజయం అందుకుంది. అయితే ఈ మూవీలో శ్రీనాథ్ బసి ప్లే చేసిన రోల్ విశ్వక్ చేయనున్నాడు. చాలా టెంపర్ తో కూడిన ఈ పాత్రకు విశ్వక్ బాగా సూట్ అవుతాడని నిర్మాతలు భావించారట. ఇదిలా ఉండగా కప్పెలా రీమేక్ హక్కులను సితార ఎంటర్టైన్మెంట్స్ సూర్యదేవర నాగవంశీ దక్కించుకున్నాడు. నాగవంశీ ఇదివరకే మలయాళం బ్లాక్ బస్టర్ 'అయ్యప్పనుమ్ కోశియుమ్' రీమేక్ హక్కులను కూడా సొంతం చేసుకున్నాడు. చూడాలి మరి హిట్ సినిమాల రీమేక్ రైట్స్ అన్నీ దక్కించుకొని ఎన్ని హిట్స్ కొడతారో..!!