హిట్ 3 అర్జున్ సర్కార్.. ఎలా ఉంటాడంటే?

Sat Dec 03 2022 20:00:01 GMT+0530 (India Standard Time)

Hit 3 Arjun Sarkar.. How will it be?

ఒక సినిమా సక్సెస్ అయితే ఇటీవల కాలంలో దానికి సంబంధించిన సీక్వెల్స్ వస్తూ ఉండడం కొంత ఆసక్తిని కలిగిస్తుంది. అంతేకాకుండా నేటితరం యువ దర్శకులు హాలీవుడ్ తరహాలో మల్టీవర్స్ ను క్రియేట్ చేస్తూ ఉండడం కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇక అందులోను మన తెలుగు దర్శకుడు శైలేష్ కొలను కూడా ఒకసారి కొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేయబోతున్నాడు.అతను రాసుకుంటున్న హిట్ కథలలో మిగతా హీరోలను కూడా కొనసాగించాలి అని రెడీ అవుతున్నాడు. మొత్తానికి హిట్ ఫస్ట్ కేసుతో పాటు సెకండ్ కేసు కూడా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయింది. ఇక మూడవ కేసు కోసం పవర్ఫుల్ ఆఫీసర్ గా నేచురల్ స్టార్ నాని రాబోతున్నాడు.

హిట్ 2 సినిమా చివర్లలో అర్జున్ సర్కార్ పాత్రలో నానిని చూపించిన విధానం హైలెట్గా నిలిచింది. వందమంది అమాయకులు తప్పించుకున్న ఒక క్రిమినల్ కూడా తప్పించుకోకూడదు అనేది వాడి సిద్ధాంతం అనే టాక్ తో అర్జున్ సర్కార్ పాత్రను చూపించారు.

అయితే ఆ పాత్ర ఎలా ఉండబోతుంది అనే విషయంలో మరికొన్ని విషయకు లీక్ అయ్యాయి. నాని క్యారెక్టర్ తెలివిగా పోలీసుల రూల్స్ బ్రేక్ చేసే విధంగా ఉంటుందట. అతను తలుచుకుంటే ట్రాన్స్ ఫర్ కాకుండా కూడా గ్యాంబ్లింగ్ చేస్తాడని ఇక ఎదురొస్తే ఎలాంటి పవర్ఫుల్ ఆఫీసర్ ఉన్నా కూడా అతనితో పోరాడేందుకు సిద్ధమవుతాడు అని తెలుస్తోంది.

ఇక హిట్ 3 సినిమాలో అడివి శేష్ పాత్ర కూడా బలంగా ఉండబోతుందట. ఇక వీరిద్దరి మధ్యలో కూడా కొంత గొడవ జరుగుతుంది అని ఒక ఫైట్ కూడా ఉండబోతున్నట్లు టాక్ అయితే వినిపిస్తోంది. ఇక దర్శకుడు శైలేష్ మేయిన్ స్టోరీ లైన్ తో పాటు కొన్ని ఎపిసోడ్స్ కూడా స్క్రిప్ట్ లో సిద్ధం చేసుకున్నాడు.

ఇక ఫైనల్ స్క్రిప్ట్ సిద్ధమైన తర్వాత వచ్చే ఏడాది సమ్మర్ తర్వాత HIT 3 సినిమా రెగ్యులర్ షూట్ ను మొదలు పెట్టే ఛాన్స్ ఉంది. అలాగే విజయ్ సేతుపతి ఆ సినిమాలో ప్రధాన విలన్ గా కనిపిస్తాడని ఇటీవల ఒక టాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. మరి అది ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.