Begin typing your search above and press return to search.

విలన్స్ లో ఈయన ఆదాయమే బాగుంది

By:  Tupaki Desk   |   8 Jun 2023 12:14 PM GMT
విలన్స్ లో ఈయన ఆదాయమే బాగుంది
X
సౌత్ ఇండియా స్టార్ డైరెక్టర్ శంకర్ ఒకేసారి రెండు పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. తమిళంలో కమల్ హాసన్ హీరోగా ఇండియన్ 2 మూవీని తెరకెక్కిస్తూ ఉన్నారు. అదే సమయంలో తెలుగులో రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ చిత్రాన్ని రెడీ చేస్తున్నారు. ఈ రెండు కూడా ప్రొడక్షన్ దశలోనే ఉన్నారు. కొద్ది రోజుల క్రితం గేమ్ చేంజర్ క్లైమాక్స్ షూటింగ్ కంప్లీట్ చేసిన శంకర్ ప్రస్తుతం ఇండియన్ 2 షూటింగ్ లో ఉన్నారు.

ఈ సినిమా మొత్తం కంప్లీట్ చేయడంపై ప్రస్తుతం ఆయన దృష్టి సారించారు. తమిళంలో భారీ బడ్జెట్ చిత్రంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇక విక్రమ్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత కమల్ హాసన్ నుంచి వస్తోన్న మూవీ కావడం, అలాగే ఇండియన్ సీక్వెల్ కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇక ఈ మూవీలో క్యాస్టింగ్ కూడా పెద్దగానే ఉంది.

సిద్దార్ద్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో విలన్ గా మోస్ట్ ఎమర్జింగ్ యాక్టర్ ఎస్.జె సూర్య నటిస్తున్నాడంట. ఇప్పటికే అతనికి సంబందించిన సీక్వెన్స్ అన్ని కూడా కంప్లీట్ చేసినట్లు తెలుస్తోంది. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతోన్న గేమ్ చేంజర్ లో కూడా ఎస్.జె సూర్యనే విలన్ గా నటిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమాని లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ఇండియన్ 2లో విలన్ పాత్రకి గాను ఎస్.జె సూర్య కెరియర్ లో ఇప్పటి వరకు అందుకోనంత ఎక్కువ రెమ్యునరేషన్ ని తీసుకున్నారంట. ఇప్పుడు ఇదే కోలీవుడ్ సర్కిల్ లో హాట్ టాపిక్ గా మారింది. అయితే సూర్య తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత అనేది మాత్రం బయటకి రాలేదు.

దర్శకుడిగా కెరియర్ స్టార్ట్ చేసిన ఎస్.జె సూర్య పవన్ కళ్యాణ్ తో ఖుషి మూవీ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ చిత్రాన్ని ముందుగా తమిళంలో విజయ్ తో చేసి తరువాత తెలుగులో పవర్ స్టార్ తో రీమేక్ చేశారు. అయితే మాతృక కంటే తెలుగు సినిమానే సెన్సేషన్ హిట్ అయ్యింది. తరువాత కొమరం పులి అనే మూవీని పవన్ కళ్యాణ్ తో ఎస్.జె సూర్య చేసిన అది డిజాస్టర్ అయ్యింది.