Begin typing your search above and press return to search.

సెట్ లోనే భీమ‌వ‌రం పిల్ల‌కి అవ‌మానం!

By:  Tupaki Desk   |   27 March 2023 10:45 AM GMT
సెట్ లోనే భీమ‌వ‌రం పిల్ల‌కి అవ‌మానం!
X
ఆహా ఓటీటీ వెబ్ సిరిస్ 'మందాకి'ని తెలుగమ్మాయి హిమ బింధు ప‌రిచ‌చ‌మైంది. ఈసిరీస్ తో అమ్మ‌డి కి మంచి గుర్తింపు ద‌క్కింది. హిమ బింధు న‌ట‌నకి ప్రేక్ష‌కులు బాగా క‌నెక్ట్ అవుతున్నారు. తెలుగు లో న‌టిగా అవ‌కాశాలు పెరుగుతున్నాయి. అయితే ఈ అవ‌కాశం అంత ఈజీ గా రాలేదు. ఈసిరీస్ కి ముందు ఎన్నో సినిమా క‌ష్టాలు చూసిన అమ్మాయే. చాలా మంది లాగే ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ప‌రిశ్ర‌మ‌కి వ‌చ్చి స‌క్సెస్ అయింది. మ‌రి ఈ భీమ‌వ‌రం పిల్ల మ‌నోగ‌తం ఏంటో ఆమె మాట‌ల్లోనే ఓసారి తెలుసుకుందాం.

'ప‌ద‌వ‌త‌ర‌గ‌తి భీమవరం- గూడూరుల్లో నా విద్యాభ్యాసం సాగింది. ఇంట‌ర్ నుంచి డిగ్రీ వ‌ర‌కూ చెన్నైలో నే చ‌దివాను. అమ్మ గృహిణి. మాది సినిమా నేప‌థ్యం ఉన్న కుటుంబ‌మే. మా నాన్న- తాతయ్య- నాయనమ్మ- పరిశ్రమ కు చెందినవారే. వాళ్లు పోషించింది చిన్న పాత్రలే అయినా తెలుగు- తమిళం- హిందీ అన్ని భాషల్లో నటించారు. అయినా స‌రే నేను సినిమాల్లో కి వెళ్తానంటే వ‌ద్ద‌న్నారు.

డిగ్రీ చేరిన త‌ర్వాత సినిమాల‌పై మ‌రింత ఆస‌క్తి పెర‌గింది. దీంతో ఎలాగూ అమ్మ‌నాన్న‌ని ఒప్పించా. ప‌రిశ్ర‌మ‌లో కొద్దో గొప్ప ప‌రిచ‌యాలున్నా? ఎవ‌రూ రిక‌మండీష‌న్ చేయ‌లేదు. స్వ‌శ‌క్తితో ఎద‌గాలి నాన్న చెప్పేవారు. అలా అవ‌కాశాలు వ‌స్తే వెళ్లు. లేక‌పోతే వ‌చ్చేయ్ అని చెప్పారు. అప్ప‌టి నుంచి సినిమా క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. 'ఇదయతాయి తిరుడాతె' చేస్తున్న సమయంలో ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి. 30వ ఎపిసోడ్ త‌ర్వాత నా స్థానంలో మ‌రో హీరోయిన్ పెడ‌తామాన్నారు.

నా న‌ట‌న వాళ్ల‌ కి న‌చ్చ‌లేదు. ముఖంలో హావభావాలు పలకడంలేదు. ఈ అమ్మాయి ముఖమూ బాలేదు. ప్రేక్షకులకు కూడా ఈమె నటన నచ్చడంలేదు. అసలు ఎలా తీసుకున్నారు' అంటూ నా ముందే సెట్‌లో ఎంతో చులకనగా మాట్లాడారు. చాలా బాధేసింది. అప్పుడే నాన్న మ‌రింత ప్రోత్స‌హించారు. సెట్ ఎలా ఉండాలో త‌యారు చేసారు. ఆ త‌ర్వాత ఎన్నో అవ‌మానాలు అన్నింటిని భ‌రించి నిల‌బ‌డ్డాను. ఎక్క‌డైతే ప‌నికిరాను అన్నారో? ఇప్పుడు అక్క‌డే నేనేంటో నిరూపించి ముందుకు సాగుతున్నాను. తీసేద్దాం అన్న వాళ్లే నువ్వే కావాలి ప‌ట్టుబ‌ట్టేంత‌గా శ్ర‌మించాను' అని అన్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.