Begin typing your search above and press return to search.

టికెట్ రేట్ల‌ను అదుపు చేయ‌క‌పోతే అంతేగా!

By:  Tupaki Desk   |   14 May 2022 2:30 AM GMT
టికెట్ రేట్ల‌ను అదుపు చేయ‌క‌పోతే అంతేగా!
X
టికెట్ రేటు సామాన్యుల‌కు అందుబాటులో ఉన్న‌ప్పుడే థియేట‌ర్లు కిట‌కిట‌లాడ‌తాయి. ప‌దే ప‌దే రిపీటెడ్ ఆడియెన్ ని థియేట‌ర్లు చూడ‌గ‌ల‌వు. కానీ ఇటీవ‌లి కాలంలో అనూహ్య ప‌రిణామాలు క‌నిపిస్తున్నాయి. ఇరు తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌భుత్వాలు టికెట్ ధ‌ర‌లు పెంచుకునేందుకు అనుమ‌తులు ఇష్టానుసారం ఇచ్చేస్తుంటే దానికి త‌గ్గ‌ట్టే బాదుడు కూడా శ్రుతిమించుతోంద‌న్న గుస‌గుస మ‌ళ్లీ మొద‌లైంది. టికెట్ పెంపు అనేది కొంద‌రికి మోదం చాలా మందికి ఖేదం! అన్న చ‌ర్చా సాగుతోంది.

ఏపీలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అదుపు చేసినంత కాలం రిపీట్ ఆడియెన్ థియేట‌ర్ల‌కు వ‌చ్చారు. కానీ ఇప్పుడు ఆ స‌న్నివేశం లేద‌న్న గుసగుస కూడా సాగుతోంది. ఇటీవ‌ల ఓ ఇద్ద‌రు పెద్ద హీరోలు న‌టించిన సినిమాల‌కు టికెట్ ధ‌ర‌ల్ని పెంచుకునేందుకు ప్ర‌భుత్వాలు అనుమ‌తులివ్వ‌డంతో ఆడియెన్ త‌ల‌లు ప‌ట్టుకున్నారు. ముఖ్యంగా కుటుంబ స‌మేతంగా సినిమా చూడాల‌నుకుంటే క్రైసిస్ కాలంలో అద‌న‌పు భారంగా భావించారు. ఫ‌లితం ఏదైనా కానీ అది బాక్సాఫీస్ వ‌సూళ్ల‌పై తీవ్ర ప్ర‌భావం చూపింద‌ని దిల్ రాజు లాంటి అన‌లిస్ట్ విశ్లేషించార‌ట‌.

అందుకే ఇప్పుడు ఆయ‌న త‌న సినిమాల విష‌యంలో అలా చేయ‌కూడ‌ద‌ని భావిస్తున్నార‌ని గుస‌గుస వినిపిస్తోంది. త్వ‌ర‌లో ఎఫ్ 3 విడుద‌ల కానుంది. ఇందులో అగ్ర హీరో వెంక‌టేష్ న‌టించినా కానీ దీనికి టికెట్ ధ‌ర‌ల్ని పెంచే యోచ‌న‌లో లేర‌ట‌. రిపీట్ ఆడియెన్ ని థియేట‌ర్ల‌కు ర‌ప్పించ‌డ‌మే ధ్యేయంగా సాధార‌ణ టికెట్ ధ‌ర‌ల్ని అందుబాటులో ఉంచ‌నున్నార‌న్న టాక్ వినిపిస్తోంది.

అయినా ఇటీవ‌ల వ‌చ్చిన‌వేవీ పాన్ ఇండియా కంటెంట్ ఉన్న‌వి కావు. వెరీ రెగ్యుల‌ర్ సినిమాలు. అందువ‌ల్ల వీటి కోసం అంత పెద్ద మొత్తాలు ఖ‌ర్చు చేసేందుకు ఫ్యామిలీస్ కూడా సిద్ధంగా లేవు. కేజీఎఫ్ 2 లాగా లేదా ఆర్.ఆర్.ఆర్ లాగా ఏదైనా స్పెష‌ల్ ఉంటేనే థియేట‌ర్ల‌కు వ‌చ్చేందుకు లేదా అధిక టికెట్ ధ‌ర‌ల్ని చెల్లించేందుకు తెలుగు ఆడియెన్ సిద్ధంగా ఉన్నారు. ఏది ప‌డితే అది చూసేందుకు ఎవ‌రూ సిద్ధంగా లేరు.

ప్ర‌తి స్టార్ హీరో టికెట్ ధ‌ర‌ల్ని పెంచేయ‌డం స‌రికాద‌న్న విశ్లేష‌ణ కూడా చేస్తున్నారు. ఈ రోజుల్లో ప్రజలు OTT ప్లాట్‌ఫారమ్‌లలో సినిమాలను చూడటానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి సినిమా హాళ్లలోకి వచ్చేలా ప్రజలను ప్రోత్సహించడానికి నిర్మాతలు సరసమైన ధరతో ముందుకు రావాల‌ని కూడా విశ్లేషిస్తున్నారు. ధ‌రాభారం చూసి ప్ర‌జ‌లు బెదిరిపోతున్నార‌ని కూడా దిల్ రాజు వంటి ప్ర‌ముఖులు అనాలిసిస్ చేసార‌ని తెలిసింది. ఆచార్య- సర్కార్ వారి పాట వంటి సినిమాలు ఎక్కువ టిక్కెట్ రేట్లు కారణంగా విడుదల రోజు కూడా తక్కువ ఆక్యుపెన్సీలను ఎదుర్కొన్నాయి. అగ్ర నిర్మాత దీనిని అనాలిసిస్ చేసార‌ట‌.

ఇక ఎఫ్ 3ని ఫ్యామిలీ ఆడియెన్ ల‌క్ష్యంగా రిలీజ్ చేయాల‌న్న‌ది ప్లాన్. పైగా టికెట్ ధ‌ర‌ల్ని అంద‌రికీ అందుబాటులో ఉంచ‌డం మంచిద‌ని నిర్ణ‌యించుకున్నార‌ని తెలిసింది. సినిమా న‌చ్చితే జ‌నం రిపీటెడ్ గా వ‌స్తార‌ని న‌మ్ముతున్నారు. ఏది ఏమైనా అనీల్ రావిపూడి- దిల్ రాజు నిర్ణ‌యం స‌రైన‌దేన‌ని ఎంక‌రేజ్ చేయాల్సి ఉంది. ఇది వెంకీ-వ‌రుణ్ వంటి హీరోల‌కే కాదు ఇత‌ర హీరోల‌కు కూడా దారి చూపుతుంద‌న‌డంలో సందేహం లేదు.