వైరల్ ఫోటోలు: ఎడారి ప్రాంతంలో సర్కారు వారి హై వోల్టేజ్ యాక్షన్..!

Tue May 04 2021 13:00:36 GMT+0530 (IST)

High Voltage Action Scenes In Sarkaru Vaari Paata

సూపర్ స్టార్ మహేష్ బాబు - డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్ తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ''సర్కారు వారి పాట''. ఇప్పటికే దుబాయ్ లో భారీ షెడ్యూల్ పూర్తి చేసిన చిత్ర బృందం.. కోవిడ్ నేపథ్యంలో హైదరాబాద్ షెడ్యూల్ కి బ్రేక్ ఇచ్చింది. అయితే తాజాగా దుబాయ్ షూట్ కి సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి. అక్కడ ఏడాది బ్యాక్ డ్రాప్ లో ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ చిత్రీకరించినట్లు తెలుస్తోంది. అలానే మహేష్ తో పాటు విదేశీ ఫైటర్స్ పాల్గొనే ఓ భారీ ఛేజింగ్ ఎపిసోడ్ ను షూట్ చేశారు. ఇక హీరోహీరోయిన్లపై వచ్చే కీలక సన్నివేశాలను కూడా ఈ షెడ్యూల్ లో చిత్రీకరించారు. మొత్తం మీద పరశురామ్ ఈ చిత్రంలో యాక్షన్ పాళ్లు ఎక్కువ ఉండేలా చూస్తున్నట్లు అర్థం అవుతోంది.కాగా 'సర్కారు వారి పాట' చిత్రం బ్యాంక్ స్కాములు - ఆర్థిక నేరగాళ్లను టార్గెట్ చేస్తూ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఇందులో మహేశ్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. చెవికి రింగు మెడ మీద రూపాయి కాయిన్ టాటూతో ప్రీ లుక్ మోషన్ పోస్టర్ ని విడుదల చేసిన మేకర్స్.. ఈ సినిమాలో వింటేజ్ మహేష్ ని చూపించబోతున్నట్లు క్లూ ఇచ్చారు.మహేష్ కెరీర్ లో వస్తున్న ఈ 27వ చిత్రానికి థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. మధే సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ఏ ఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ - 14 రీల్స్ ప్లస్ - మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. 'సర్కారు వారి పాట'ను 2022 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.