తెలుగు బిగ్ బాస్ షో ను బ్యాన్ చేయాలి అంటూ జగదీశ్వరరెడ్డి అనే వ్యక్తి ఏపీ హైకోర్టును ఆశ్రయించాడు. బిగ్ బాస్ షో వల్ల సమాజం చెడి పోతుంది.. యువత తప్పుదారి పడుతున్నారు అంటూ ఆయన తన పిటీషన్ లో ఆవేదనను వ్యక్తం చేయడం జరిగింది. ఆ పిటీషన్ ను విచారణకు కోర్టు స్వీకరించింది.
జగదీశ్వరరెడ్డి పిటీషన్ కు కౌంటర్ దాఖలు చేయాలి అంటూ బిగ్ బాస్ షో నిర్వాహకులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కౌంటర్ దాఖలకు మళ్లీ వాయిదా కోరవద్దని ముందస్తుగానే ఆరు వారాల సమయంను హైకోర్టు ఇవ్వడం జరిగింది.
పిటీషనర్ కోరినట్లుగా షో ను ఎందుకు బ్యాన్ చేయకూడదో తెలియజేస్తూ షో నిర్వాహకులు కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ ఆరు వారాల సమయం లో బిగ్ బాస్ నిర్వాహకుల నుండి కచ్చితంగా కౌంటర్ దాఖలు అవ్వాల్సి ఉంటుంది.
హిందీలో సూపర్ హిట్ అయ్యి దశాబ్దకాలంకు పైగా కొనసాగుతున్న బిగ్ బాస్ తెలుగు లో ఇప్పటి వరకు ఆరు సీజన్ లు పూర్తి చేసుకుని ఈ ఏడాది ఏడవ సీజన్ కొనసాగాల్సి ఉంది. ఏడాదికి ఒక సీజన్ చొప్పున షో కొనసాగుతూ ఉంది. ఈ కోర్టు వివాదం నేపథ్యంలో ఈ ఏడాది సీజన్ ఉంటుందా లేదా అనేది బిగ్ బాస్ ప్రేక్షకుల్లో చర్చ మొదలు అయ్యింది.
మొదటి సీజన్ కు ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా.. రెండవ సీజన్ కు నాని హోస్టింగ్ చేశాడు. మూడవ సీజన్ నుండి నాగార్జున హోస్టింగ్ చేస్తూ వచ్చాడు. మధ్యలో ఒక ఓటీటీ సీజన్ కలిపి మొత్తంగా అయిదు సీజన్ లకు నాగార్జున హోస్టింగ్ చేశాడు. ఈ ఏడాది రాబోతున్న కొత్త సీజన్ లో నాగార్జున హోస్ట్ గా కనిపించడు అంటూ ప్రచారం జరుగుతోంది. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.