రాక్షస రాజు `హిడింబ`లా మీద పడతాడా?

Sun Aug 01 2021 18:36:40 GMT+0530 (IST)

Hidimba First Look

యంగ్ హీరో అశ్విన్ బాబు తాను నటించిన ప్రతి సినిమాలో తన పరిణితిని ప్రదర్శిస్తున్నారు. అతని తదుపరి చిత్రానికి అనీల్ కృష్ణ కన్నెగంటి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ (SVK సినిమాస్) బ్యానర్ లో గంగపట్నం శ్రీధర్ నిర్మించిన హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ త్వరలో రిలీజ్ కి రానుంది.అశ్విన్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు. హిడింబ అనే స్ట్రైకింగ్ టైటిల్ ని ప్రకటించారు. ఈ పోస్టర్ లో అశ్విన్ బాబు యాక్షన్ ప్యాక్డ్ అవతార్ లో కనిపించనున్నారు. పోస్టర్ లో అతని తల నుండి రక్తం కారుతున్న తీరు చూస్తుంటే యాక్షన్ కి బిగ్ స్కోప్ ఉన్న చిత్రమిదని అర్థమవుతోంది. నిజానికి హిడింబా ఒక శక్తివంతమైన రాక్షస రాజు పేరు. పోస్టర్ కి తగ్గట్టే హీరో ఉగ్రరూపానికి సూటబుల్  టైటిల్ ఇది.

ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తయింది. ఇక ఈ చిత్రం కోసం అశ్విన్ బాబు  మేకోవర్ ఆకట్టుకుంది. అతడి సరసన నందిత శ్వేత కథానాయిక. బి రాజశేఖర్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. వికాస్ బడిసా సంగీతం అందిస్తున్నారు. అశ్విన్ బాబు- నందిత శ్వేత- శ్రీనివాస రెడ్డి- సాహితి ఆవంచ- సంజయ్ స్వరూప్- షిజ్జు- విద్యులేఖ రామన్ - రాజీవ్ కనకాల- శుభలేక సుదకర్- ప్రమోదిని- రఘు కుంచె- రాజీవ్ పిళ్లై- దీప్తి నల్లమోతు తదితరులు నటిస్తున్నారు.