Begin typing your search above and press return to search.

టాప్ స్టోరి: మాయ‌దారి గ్యాంబ్లింగ్ లోకి లాగుతున్న హీరోయిన్లు!

By:  Tupaki Desk   |   9 Jun 2023 8:00 AM GMT
టాప్ స్టోరి: మాయ‌దారి గ్యాంబ్లింగ్ లోకి లాగుతున్న హీరోయిన్లు!
X
అందాన్ని ఆరాధించే ప్ర‌జ‌ల్ని బుట్ట‌ లో వేయ‌డం చాలా ఈజీ అనుకుంటే పొర‌పాటే. ఈ రోజుల్లో ఎవ‌రు ఏది గ్యాంబ్లింగ్ ? ఏది రియాలిటీ? అనేది తెలుసుకోకుండా పెట్టుబ‌డులు పెట్ట‌డం లేదు. అలాగ‌ని గ్యాంబ్ల‌ర్ల‌ కు చిక్క‌ని అమాయ ప్ర‌జ‌లు లేక‌పోలేదు. సైబ‌ర్ సెక్యూరిటీ కాప్ ఎంత‌గా గ‌గ్గోలు పెడుతున్నా కానీ ఏదో చోట ఆన్ లైన్ గ్యాంబ్ల‌ర్ల వ‌ల‌ కు చిక్కుతూనే ఉన్నారు.

అప్ప‌ట్లో కాసినోవా గ్యాంబ్లింగ్ లో ప్ర‌ముఖ తెలుగు రాజ‌కీయ‌నాయ‌కుడు సినిమా క‌నెక్ష‌న్ ఉన్న వ్య‌క్తి పేరు మీడియా హెడ్ లైన్స్ లో మార్మోగింది. కాసినోవా ఆట‌ లోకి ప్ర‌జ‌ల డ‌బ్బు గుంజేందు కు ఒక మాఫియానే సెట్ చేశార‌ని కోట్లాది రూపాయ‌ల బిజినెస్ సాగించార‌ని క‌థ‌నాలు వ‌చ్చాయి.

అదంతా స‌రే కానీ.. ఈ కాసినోవాలు.. పెస్టిసైడ్ కోలాల కు స్టార్లు ప్ర‌చారం చేయ‌డం త‌మ అభిమానుల్ని.. అమాయక ప్ర‌జ‌ల్ని ఆక‌ర్షించ‌డం ఎంత‌వ‌ర‌కూ స‌బ‌బు? రెస్పాన్సిబుల్ గ్యాంబ్లింగ్ ప్రాక్టీస్ అంటూ నైసుగా ఉండే ప‌ద‌జాలం తో నేటిత‌రం క‌థానాయిక తాజా వాణిజ్య ప్ర‌క‌ట‌న (ఆన్ లైన్ గేమ్) లో ఆక‌ర్షిస్తున్న తీరు చూస్తుంటే నిజంగానే అమాయ‌క బాబులు బుట్ట‌ లో ప‌డ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఊరిస్తూ హొయ‌లొలికిస్తూ అలా అలా బుట్ట‌ లో వేస్తున్న తీరు చూస్తుంటే వామ్మో ఈ బ్యాంబ్లింగ్ కి ఇంత ప్ర‌చారం దేనికో అని అనిపించ‌క మాన‌దు.

ఇటీవ‌లి కాలంలో అందాల హీరోయిన్లు అంతా కాసినోవాల‌ కు లేదా హానిక‌ర‌ కోలాల‌ కు రంగు ద్ర‌వాల‌ కు ప్ర‌చారం చేస్తున్నారు. హాంకాంగ్ టు గోవా క్యాసినోవా ఆట‌ కు అడిక్ట్ అయి డ‌బ్బంతా పోగొట్టుకున్న‌ వాళ్ల‌కు కొద‌వేమీ లేద‌ని నిరంత‌రం క‌థ‌నాలు వ‌స్తున్నాయి. ఇంత‌కుముందు 2.0 - ఐ చిత్రాల క‌థానాయిక ఎమీజాక్స‌న్ క్యాసినోవాల‌ కు విప‌రీతంగా ప్ర‌చారం చేసింది. ఆ త‌ర్వాత ప‌లువురు తెలుగు త‌మిళ హీరోలు కూడా క్యాసినోవాల‌ కు ప్ర‌చారం చేయడం పై తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి.

ఆ త‌ర్వాత అలాంటి వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల్లో ఆ హీరోలు క‌నిపించ‌డం త‌గ్గింది. కానీ ఇటీవ‌లి కాలంలో యూత్ లో క్రేజున్న క‌థానాయిక‌లు ఈ గ్యాంబ్లింగ్ షోల‌కు ప్ర‌చారం చేయ‌డం పెరుగుతోంది. సోష‌ల్ మీడియాల వెల్లువ‌లో ఇన్ స్టాలు ట్విట్ట‌ర్ ల‌ తోనే బోలెడంత ప్ర‌చారం సాగిస్తూ అమాయ‌కుల్ని విలాసాల‌ వ‌ల్లోకి లాగుతున్నారు.

ఆన్ లైన్ ఆట‌లు అంటేనే బిగ్ గ్యాంబ్లింగ్ అన్నది ప్రాక్టిక‌ల్ గా డబ్బు పోగొట్టుకున్న‌వాళ్ల ఆవేద‌న‌. కానీ ఇంకా ఇంకా అలాంటి వాటికి ప్ర‌చారం చేస్తూ మ‌న స్టార్లు ధ‌నార్జ‌నే ధ్యేయంగా స్వార్థ ఆలోచ‌న‌ల‌ తో ముందుకు సాగ‌డం స‌రికాద‌ని ప‌లువురు సూచిస్తున్నారు. మునుముందు అయినా ఈ ప‌రిస్థితి మారుతుందేమో చూడాలి.